Pawan Kalyan – Karthi : కార్తీ, తిరుమల లడ్డు వివాదంపై మళ్ళీ మాట్లాడిన పవన్ కళ్యాణ్.. కార్తీ, సూర్య ఇద్దరూ..
తాజాగా పవన్ ఓ తమిళ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో పవన్ కి కార్తీ గురించి ప్రశ్న ఎదురవడంతో మళ్ళీ ఆ వివాదంపై స్పందించారు.

Pawan Kalyan Reacts again on Karthi Regarding Tirumala Laddu Issue
Pawan Kalyan – Karthi : గత కొన్ని రోజులుగా తిరుమల లడ్డు వివాదం సాగుతున్న సంగతి తెలిసిందే. ఈ విషయంలో పవన్ ముందుండి మాట్లాడుతున్నారు. అయితే ఓ సినిమా ఈవెంట్లో కార్తీ అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పి, లడ్డు గురించి ప్రశ్న వస్తే ఇప్పుడు లడ్డు గురించి మాట్లాడొద్దు, సెన్సిటివ్ టాపిక్ అంటూ వ్యంగ్యంగా సమాధానం ఇవ్వడం, చుట్టూ ఉన్నవాళ్లు నవ్వడంతో ఈ వీడియో వైరల్ అయి పవన్ కళ్యాణ్ దాకా వెళ్ళింది.
దీంతో పవన్ కార్తీని అలా మాట్లాడొద్దు అంటూ కామెంట్ చేయడం, కార్తీ సారి చెప్పడం, పవన్ మళ్ళీ అర్ధం చేసుకున్నందుకు ధన్యవాదాలు అంటూ కార్తీకి రిప్లై ఇవ్వడం జరిగాయి. ఇలా కార్తీ – పవన్ – లడ్డు వివాదం తెలుగుతో పాటు తమిళ రాష్టంలోనూ వైరల్ అయింది. కొంతమంది తమిళ్ వాళ్ళు కార్తీ తప్పేం లేదంటూ పవన్ ని విమర్శించారు.
Also Read : Pawan Kalyan : బాబోయ్.. పవన్ కళ్యాణ్ కి ఈ రేంజ్ లో తమిళ్ వచ్చా.. తమిళ మీడియాకు పవన్ స్పెషల్ ఇంటర్వ్యూ..
అయితే తాజాగా పవన్ ఓ తమిళ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో పవన్ కి కార్తీ గురించి ప్రశ్న ఎదురవడంతో మళ్ళీ ఆ వివాదంపై స్పందించారు. పవన్ మాట్లాడుతూ.. కార్తీ, సూర్య ఇద్దరూ భక్తులే, వాళ్ళు కూడా తిరుమలకు వెళ్లారు. కార్తీ గారు కావాలని అలా మాట్లాడలేదు. కానీ అయన అనుకోకుండా అలా మాట్లాడటం, ఆ చుట్టూ ఉన్న వాళ్ళు నవ్వడంతో అలాంటి ఇష్యూ మీద నెగిటివ్ గా వెళ్ళింది. వాళ్ళు సెలబ్రిటీ పర్సన్స్ కాబట్టి ఏదైనా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి. మనల్ని చూసి ప్రజలు ఫాలో అవుతారు. అందుకే ఆ రోజు అలా స్పందించాను. తమిళ సినీ పరిశ్రమ నాకు బ్రదర్స్ లాంటి వాళ్ళు అని అన్నారు. దీంతో పవన్ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.
"#Karthi & #Suriya are devotees where they went to Thirumala. Even though Karthi spoke lightheartedly, he knows what I meant. They are role models. Lot of people laughed for that so I see as an insult. I see Tamil Cinema industry as my Brothers"
– #PawanKalyan about Laddu issue pic.twitter.com/u16WXwrW9e— AmuthaBharathi (@CinemaWithAB) October 1, 2024