×
Ad

NBK 111: నందమూరి ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. పవర్ ఫుల్ కథ సెట్.. ఈ బ్యాక్ డ్రాప్ తెలిస్తే..

నందమూరి బాలకృష్ణ నెక్స్ట్ సినిమా(NBK 111) కోసం పవర్ ఫుల్ కథ సెట్ చేసిన దర్శకుడు గోపీచంద్ మలినేని.

Balakrishna NBK 111 movie shooting starting soon

  • NBK 111 కోసం కొత్త కథ రెడీ
  • గ్యాంగ్ స్టార్ డ్రామా కాన్సెప్ట్ ను సిద్ధం చేసిన గోపీచంద్ మలినేని
  • త్వరలోనే అధికారిక ప్రకటన

NBK 111: నందమూరి నటసింహం బాలకృష్ణ ఫుల్ జోష్ లో ఉన్నారు. కెరీర్ లో ఎన్నడూ లేని విదంగా వరుసగా క్రేజీ సినిమాలను ఒకే చేస్తూ ఉంటాడు. ఇక ఇటీవల ఆయన డాకు మహారాజ్ లాంటి సూపర్ తరువాత అఖండ 2 సినిమా చేశాడు. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా ప్లాప్ అయ్యింది. దీంతో, నందమూరి ఫ్యాన్స్ డిజప్పాయింట్ అవుతున్నారు. అయితే, ఫ్యాన్స్ లో జోష్ నింపేందుకు NBK 111 సినిమాను అనౌన్స్ చేశాడు.

మాస్ చిత్రాల దర్శకుడు గోపిచంద్ మలినేనితో పాన్ ఇండియా సినిమాను స్టార్ట్ చేశాడు బాలకృష్ణ. పీరియాడికల్ డ్రామాగా రానున్న ఈ సినిమాను అధికారికంగా కూడా స్టార్ట్ అయ్యింది. కానీ, ఏమైందో తెలియదు ఆ భారీ ప్రాజెక్టు ఆగిపోయింది. దీంతో, నందమూరి(NBK 111) ఫ్యాన్స్ ఒక్కసారిగా షాక్ అయ్యారు. బడ్జెట్ కారణాల వల్ల ఈ ప్రాజెక్టు ఆగిపోయింది అనే వార్తలు వినిపించాయి. ఇక అప్పటినుంచి ఈ ప్రాజెక్టు కోసం కొత్త కథను సెట్ చేసే పనిలో పడ్డాడు గోపీచంద్ మలినేని.

Anil Ravipudi: నెక్స్ట్ సంక్రాంతికి మరో సినిమా చేస్తా.. లెక్క బ్యాలన్స్ చేస్తా.. అనిల్ రావిపూడి హాట్ కామెంట్స్

తాజా సమాచారం మేరకు, ఈ ప్రాజెక్టు కోసం పవర్ ఫుల్ కథను సెట్ చేశాడట దర్శకుడు గోపీచంద్ మలినేని. నందమూరి ఫ్యాన్స్ బాలకృష్ణను ఎలా చూడాలని అనుకుంటున్నారో అదే రేంజ్ లో ఈ సినిమాలో కనిపిస్తాడట. అది కూడా మాఫియా డాన్ గా. ముంబై బ్యాక్డ్రాప్ లో సాగే గ్యాంగ్ స్టర్ డ్రామాగా ఈ సినిమాను తెరకెక్కిస్తాడట గోపిచంద్ మలినేని. త్వరలోనే ఈ విషయం గురించి అధికారిక ప్రకటన రానుందట.

ఇక ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఏప్రిల్ నుంచి మొదలుకునుందట. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తయ్యాయాని సమాచారం. ఈ ఏడాది చివర్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుందట. మరి అఖండ 2తో ఫ్యాన్స్ ని, ఆడియన్స్ ని డిజప్పాయింట్ చేసిన బాలకృష్ణ తన నెక్స్ట్ సినిమాతో ఏమేరకు ఆకట్టుకున్నాడు అనేది చూడాలి.