Anil Ravipudi: నెక్స్ట్ సంక్రాంతికి మరో సినిమా చేస్తా.. లెక్క బ్యాలన్స్ చేస్తా.. అనిల్ రావిపూడి హాట్ కామెంట్స్
తన నెక్స్ట్ సినిమా గురించి దర్శకుడు అనిల్ రావిపూడి(Anil Ravipudi) ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చాడు.
Director Anil Ravipudi interesting comments about his next film.
- 2027 సంక్రాంతికి అనిల్ మరో సినిమా
- 5+5 తో లెక్క బ్యాలన్స్ చేస్తాడట
- సినిమాపై త్వరలోనే అధికారిక ప్రకటన
Anil Ravipudi: మన శంకర వరప్రసాద్ గారు సినిమాతో మరో బ్లాక్ బస్టర్ ను తన ఖాతాలో వేసుకున్నాడు దర్శకుడు అని రావిపూడి. మెగాస్టార్ చిరంజీవి హీరోగా వచ్చిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా విడుదలై భారీ విజయాన్ని సాధించింది. కేవలం ఎనిమిది రోజుల్లోనే రూ.300 కోట్లకు పైగా వసూళ్లు సాధించి టాలీవుడ్ ఇండస్ట్రీలో సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసింది. రీజనల్ సినిమాల్లో ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది మన శంకర వరప్రసాద్ గారు సినిమా.
దీంతో, దర్శకుడు అనిల్ రావిపూడి(Anil Ravipudi) నెక్స్ట్ సినిమాపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ఏ హీరోతో చేస్తాడు? ఎలాంటి సినిమా చేస్తాడు అని చర్చ మొదలయ్యింది. కానీ, అనిల్ మాత్రం ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. అయితే, తాజాగా జరిగిన ఒక ఇంటర్వ్యూలో తన గత సినిమాల గురించి, నెక్స్ట్ సినిమా గురించి ఇంటరెస్టింగ్ కామెంట్స్ చేశాడు అనిల్ రావిపూడి.
Rukmini Vasanth: పూల బుట్టతో బుట్టబొమ్మలా.. రుక్మిణి వసంత్ ఫొటోలు
‘నన్ను సంక్రాంతి దర్శకుడు అంటున్నారు అంతా. ఇప్పటివరకు నేను 9 సినిమాలు చేశాను. అందులో కేవలం 4 మూడు సినిమాలు మాత్రమే సంక్రాంతి సీజన్ లో విడుదల అయ్యాయి. మిగతా 5 సినిమాలు నార్మల్ డేస్ లోనే రిలీజ్ అయ్యాయి. కాబట్టి, 2027 సంక్రాంతికి మళ్ళీ సినిమాతో ఆడియన్స్ ముందుకు తప్పకుండా వస్తాను. 5+5 లెక్క బ్యాలన్స్ చేస్తాను. జూన్ లో సినిమా స్టార్ట్ చేసి మళ్ళీ సంక్రాంతికే సినిమాను విడుదల చేస్తాను’ అంటూ చెప్పుకొచ్చాడు.
దీంతో, మళ్ళీ నెక్స్ట్ సంక్రాంతికి కూడాఅనిల్ రావిపూడి మరో సినిమాతో రావడం అనేది కన్ఫర్మ్ అయ్యింది. కానీ, హీరో ఎవరు అనేది మాత్రం ఇంకా సస్పెన్స్ గానే ఉంది. అయితే, టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి బలంగా వినిపిస్తున్న సమాచారం మేరకు వెంకటేష్, రానాతో ఒక విలేజ్ డ్రామా కాన్సెప్ట్ తో సినిమా చేయాలనీ చూస్తున్నాడట అనిల్ రావిపూడి. దానికి ‘సంక్రాంతి 2027’ అనే టైటిల్ కూడా ఫిక్స్ చేసినట్టు సమాచారం. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుందట. ఇదే గనక నిజమైతే 2027 సంక్రాంతికి కూడా అనిల్ బ్లాక్ బస్టర్ కొట్టడం ఖాయం.
