Balakrishna Next Movie With Sarkaru Vaari Paat Director Parusuram
Balakrishna: అల్లు శిరీష్, అను ఇమ్మాన్యుయేల్ హీరోహీరోయిన్లుగా తెరకెక్కుతున్న లవ్ అండ్ రొమాంటిక్ మూవీ “ఉర్వశివో రాక్షసీవో”. యూత్ ఫుల్ ఎంటెర్టైనెర్ గా వస్తున్న ఈ సినిమా నవంబర్ 4న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటికే విడుదలైన సాంగ్స్, టీజర్, ట్రైలర్ ఆడియన్స్ లో సినిమాపై మంచి బజ్ ని క్రియేట్ చేసిని.
BalaKrishna: తన లైఫ్ లో ఊర్వశి ఎవరో? రాక్షసి ఎవరో? బయటపెట్టిన బాలయ్య..
ఇక ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ఆదివారం హైదరాబాద్ లో నిర్వహించింది చిత్ర యూనిట్. ఈ కారిక్రమానికి అతిధిగా నందమూరి బాలకృష్ణతో పాటు ‘సర్కారు వారి పాట’ దర్శకుడు పరుశురాం కూడా హాజరయ్యాడు. ఈ వేడుకలో దర్శకుడు మాట్లాడుతూ.. తన తదుపరి సినిమా బాలయ్యతో ఉండబోతున్నట్లు హింట్ ఇచ్చాడు.
పరశురామ్ మాట్లాడుతూ.. “బాలకృష్ణ సర్ త్వరలోనే మీ దగ్గరకి ఒక అద్భుతమైన కథతో రాబోతున్నాను. అల్లు అరవింద్ గారు మీ కోసం ఒక స్క్రిప్ట్ రెడీ చేయిస్తున్నారు నాతో, స్క్రిప్ట్ వర్క్ పూర్తీ అవ్వగానే, మీకు కథ వినిపిస్తా” అంటూ వెల్లడించాడు. దీంతో బాలయ్య, పరుశురాం కలయికలో ఒక సినిమా ఉండబోతుందని తెలియడంతో.. అభిమానులు సంబరాలు జరుపుకుంటున్నారు.