Balakrishna : మా కుటుంబంతో కైకాల గారికి ప్రత్యేక అనుబంధం ఉంది.. బాలకృష్ణ!
సినీ నటుడు 'కైకాల సత్యనారాయణ' ఈరోజు తెల్లవారుజామున అనారోగ్య సమస్యలతో మరణించారు. ఇక ఆయన మరణంతో టాలీవుడ్ ఇండస్ట్రీ తీవ్ర దిగ్బ్రాంతికి గురైంది. కైకాల అకాల మరణానికి చింతిస్తూ సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే నందమూరి బాలకృష్ణ..

Balakrishna post on kaikala satyanarayana death
Balakrishna : సినీ నటుడు ‘కైకాల సత్యనారాయణ’ ఈరోజు తెల్లవారుజామున అనారోగ్య సమస్యలతో మరణించారు. తెలుగుతెరపై పౌరాణిక, జానపద, చారిత్రక, సాంఘిక.. ఇలా అన్ని జోనర్‌లో నటించి ఎస్వీ రంగారావు, సీనియర్ ఎన్టీఆర్ తరువాత తానే అనిపించుకున్నారు కైకాల. 60 ఏళ్ళ సినీ జీవితంలో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, విలన్‌గా, కమెడియన్‌గా నటించి ‘నవరస నటనా సార్వభౌముడి’గా పేరుని సంపాదించుకున్నాడు.
Balakrishna : కంగనా రనౌత్ కి పద్మశ్రీ వచ్చింది నీకెందుకు రాలేదు?
ఇక ఆయన మరణంతో టాలీవుడ్ ఇండస్ట్రీ తీవ్ర దిగ్బ్రాంతికి గురైంది. కైకాల అకాల మరణానికి చింతిస్తూ సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే నందమూరి బాలకృష్ణ.. “కైకాల సత్యనారాయణ గారి మరణం దిగ్భ్రాంతి కలిగించింది. కైకాల సత్యనారాయణ గారు ఆరు దశాబ్దాలు పాటు తెలుగు సినిమా రంగంలో పౌరాణిక, సాంఘిక, చారిత్రక, జానపద పాత్రల్లో నవరస నటనా సార్వభౌముడిగా తన వైవిధ్యమైన నటనతో అలరించారు.
మా కుటుంబంతో కైకాల సత్యనారాయణ గారికి స్నేహ సంబంధాలు వున్నాయి. నాన్నగారితో కలిసి ఎన్నో సినిమాల కోసం పనిచేశారు. నా చిత్రాల్లో కూడా మంచి పాత్రలు పోషించారు. మంచి నటుడిగానే కాకుండా పార్లమెంట్ సభ్యునిగా తనదైన ముద్రవేశారు. సినీ జీవితంలోనూ, ప్రజాజీవితంలోనూ ఎంతో బాధ్యతాయుతంగా ఆయన అందించిన సేవలు మరువలేనివి. ఈ రోజు ఆయన మన మధ్య లేకపోవడం ఎంతో దురదృష్టకరం. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ వారి కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను” అంటూ స్పందించాడు.