Balakrishna : ప్రజల కోసం బాలయ్య.. త్వరలో ఏపీలో బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్..

బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్ గా ఎంతోమంది పేద క్యాన్సర్ పేషంట్స్ కి సేవలు అందిస్తున్నారు బాలయ్య.

Balakrishna Says Basavatarakam Indo American Cancer Hospital will starts soon in Andhrapradesh

Balakrishna : బాలకృష్ణ ఓ పక్క హీరోగా వరుస విజయాలు సాధిస్తూ వెళ్తున్నారు. ఇటీవలే మూడోసారి హిందూపురం ఎమ్మెల్యేగా గెలిచారు. మరో పక్క బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్ గా ఎంతోమంది పేద క్యాన్సర్ పేషంట్స్ కి సేవలు అందిస్తున్నారు. హైదరాబాద్ లో బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ లో తక్కువ చార్జీలతో, కొంతమంది పేద రోగులకు ఉచితంగా క్యాన్సర్ ట్రీట్మెంట్స్ ఇస్తున్నారు.

ఇప్పటివరకు బసవతారకం హాస్పిటల్ నుంచి 2 లక్షల మందికి పైగా క్యాన్సర్ క్యూర్ అయి బయటకు వెళ్లారు. బాలకృష్ణ తల్లి బసవతారకం క్యాన్సర్ తో చనిపోవడం. ఆ రోజుల్లో క్యాన్సర్ ట్రీట్మెంట్ సరిగ్గా లేకపోవడంతో తన తల్లిలా ఇంకొకరికి జరగకూడదని ప్రజల కోసం ఆలోచించి ఈ హాస్పిటల్ నడుపుతున్నారు బాలయ్య. అయితే ఇన్నాళ్లు హైదరాబాద్ లోనే సేవలు అందించిన హాస్పిటల్ ఇప్పుడు ఏపీలో కూడా మొదలుకానుంది. హైదరాబాద్ బసవతారకం హాస్పిటల్ కు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఎంతోమంది వస్తుంటారు.

Also Read : Prabhas : మొదటిసారి నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్ర చేస్తున్నా.. కల్కి గురించి మాట్లాడిన ప్రభాస్..

గతంలో ఏపీలో చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు అమరావతిలో బసవతారకం హాస్పిటల్ కట్టేందుకు స్థలం కేటాయించారు. ఇప్పుడు ఆ స్థలంలోనే బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ కట్టబోతున్నారు. తాజాగా ఈ క్యాన్సర్ హాస్పిటల్ వార్షికోత్సవంలో బాలకృష్ణ మాట్లాడుతూ.. త్వరలో ఏపీలో కూడా బసవతారకం హాస్పిటల్ మొదలవుతుంది అని తెలిపారు. అమరావతిలో బసవతారకం హాస్పిటల్ పూర్తయితే ఏపీ నుంచి హైదరాబాద్ కి వచ్చే ఎంతోమంది పేద క్యాన్సర్ పేషంట్స్ కి ఊరట కలుగుతుంది. దీనిపై బాలయ్య అభిమానులతో పాటు అందరూ బాలయ్యని అభినందిస్తున్నారు.