Prabhas : మొదటిసారి నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్ర చేస్తున్నా.. కల్కి గురించి మాట్లాడిన ప్రభాస్..

ఈ సినిమాలో ప్రభాస్ కల్కి కాదని ఇప్పటికే అనుకుంటున్నారు ప్రేక్షకులు. అయితే ప్రభాస్ మాట్లాడుతూ..

Prabhas : మొదటిసారి నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్ర చేస్తున్నా.. కల్కి గురించి మాట్లాడిన ప్రభాస్..

Prabhas Interesting Comments on his Character in Kalki 2898AD Movie

Prabhas : ప్రభాస్ కల్కి సినిమా జూన్ 27న రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే రిలీజ్ చేసిన ట్రైలర్స్ తో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. హాలీవుడ్ రేంజ్ లో ఈ సినిమా విజువల్స్ ఉన్నాయి. ఇప్పటికే పలుచోట్ల బుకింగ్స్ ఓపెన్ అవ్వగా టికెట్లు హాట్ కేకుల్లా సేల్ అవుతున్నాయి. అయితే మూవీ ప్రమోషన్స్ మాత్రం చాలా తక్కువ చేస్తున్నారు. తాజాగా కల్కి టీమ్ నుంచి ప్రభాస్, కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకోన్, ప్రియాంక దత్, స్వప్న దత్ లు కలిసి ఓ స్పెషల్ చిట్ చాట్ చేసి వీడియో రిలీజ్ చేశారు.

ఈ చిట్ చాట్ లో మూవీ టీమ్ అంతా చాలా విషయాలు మాట్లాడుకున్నారు. పలు ఆసక్తికర విషయాలు తెలియచేసారు. అయితే ప్రభాస్ మాట్లాడుతూ.. బాహుబలి తర్వాత మళ్ళీ కామెడీ ఈ సినిమాలోనే చేస్తున్నాను. అలాగే కొంచెం నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ చేస్తున్నాను. ఈ క్యారెక్టర్ నా కెరీర్ లోనే బెస్ట్ క్యారెక్టర్ అని తెలిపాడు. దీంతో ప్రభాస్ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

Also Read : Vijayashanthi : పోలీసాఫీసర్ గా విజయశాంతి.. లేడీ సూపర్ స్టార్ ఈజ్ బ్యాక్..

ఇప్పటివరకు రిలీజ్ చేసిన ట్రైలర్స్ తో సినిమాలో ప్రభాస్ కల్కి కాదని, ప్రభాస్ అమితాబ్ తో ఫైటింగ్ చేస్తాడని, డబ్బుల కోసం ఏ పనైనా చేసే ఒక రౌడీ పాత్రలో ప్రభాస్ నటిస్తున్నట్టు తెలుస్తుంది. దీంతో ఈ సినిమాలో ప్రభాస్ కల్కి కాదని ఇప్పటికే అనుకుంటున్నారు ప్రేక్షకులు. ఇప్పుడు ప్రభాస్ డైరెక్ట్ గా నెగిటివ్ పాత్ర చేస్తున్నాను అని చెప్పడంతో ప్రభాస్ విలన్ చేస్తున్నాడా అని అభిమానులు సందేహం వ్యక్తం చేస్తున్నారు.