Vijayashanthi : పోలీసాఫీసర్ గా విజయశాంతి.. లేడీ సూపర్ స్టార్ ఈజ్ బ్యాక్..
విజయశాంతి మళ్ళీ పవర్ ఫుల్ పోలీసాఫీసర్ గా కనిపించబోతుంది.

Vijayashanthi Power full Police Officer Role in Kalyan Ram Movie Birthday Glimpse Released
Vijayashanthi : ఒకప్పుడు కమర్షియల్ సినిమాలతో పాటు లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేసి లేడి సూపర్ స్టార్, లేడి అమితాబ్ అనిపించుకుంది విజయశాంతి. విజయశాంతి పోలీసాఫీసర్ రోల్ చేస్తే సినిమా అదిరిపోవాల్సిందే. ఎంతోమంది మహిళలకు విజయశాంతి ప్రేరణగా నిలిచింది. సినిమాల్లో విజయశాంతి యాక్షన్ అదరగొట్టేసింది. కానీ రాజకీయాలతో కొన్నాళ్ళు సినిమాలకు గ్యాప్ ఇచ్చిన విజయశాంతి కొన్నాళ్ల క్రితం మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చింది.
Also Read : Sonakshi Sinha – Zaheer Iqbal : బాలీవుడ్ కొత్త జంట.. ఎంత క్యూట్‌గా డ్యాన్స్ వేస్తున్నారో..
ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ లో విజయశాంతి మంచి మంచి కథలను సెలెక్ట్ చేసుకొని దూసుకెళ్లాలని ట్రై చేస్తుంది. ఈ క్రమంలో కళ్యాణ్ రామ్ 21వ సినిమా ఒప్పుకుంది. ఈ సినిమాలో విజయశాంతి మళ్ళీ పవర్ ఫుల్ పోలీసాఫీసర్ గా కనిపించబోతుంది. నేడు విజయశాంతి పుట్టిన రోజు కావడంతో కళ్యాణ్ రామ్ సినిమా నుంచి విజయశాంతి గ్లింప్స్ రిలీజ్ చేశారు.
ఈ గ్లింప్స్ లో యాక్షన్ సీక్వెన్స్ తో అదిరిపోయే డైలాగ్స్ తో విజయశాంతి పోలీస్ డ్రెస్ లో అదరగొట్టింది. ఈ గ్లింప్స్ చూసి లేడి సూపర్ స్టార్ ఈజ్ బ్యాక్ అని అంటున్నారు. గ్లింప్స్ లో.. వైజయంతి IPS.. తను పట్టుకుంటే పోలీస్ తుపాకీకి ధైర్యం వస్తుంది. వేసుకుంటే యూనిఫామ్ కి పౌరుషం వస్తుంది. తనే ఒక యుద్ధం. నేనే తన సైన్యం అనే కళ్యాణ్ రామ్ వాయిస్ ఓవర్ తో పవర్ ఫుల్ గా డైలాగ్స్ చెప్పించారు. మీరు కూడా ఈ విజయశాంతి పవర్ ఫుల్ గ్లింప్స్ చూసేయండి..
ఇక ఈ సినిమా కళ్యాణ్ రామ్ 21వ సినిమాగా తెరకెక్కుతుంది. అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్ పై ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఇందులో సయీ మంజ్రేకర్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇప్పుడు రిలీజ్ చేసిన విజయశాంతి గ్లింప్స్ చూసి ఆమె అభిమానులతో పాటు ప్రేక్షకులు ఆశ్చర్యపోతూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.