Sonakshi Sinha – Zaheer Iqbal : బాలీవుడ్ కొత్త జంట.. ఎంత క్యూట్‌గా డ్యాన్స్ వేస్తున్నారో..

ప్రస్తుతం సోనాక్షి - జహీర్ పెళ్లి ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Sonakshi Sinha – Zaheer Iqbal : బాలీవుడ్ కొత్త జంట.. ఎంత క్యూట్‌గా డ్యాన్స్ వేస్తున్నారో..

Sonakshi Sinha Zaheer Iqbal Dance Videos in Wedding Goes Viral

Sonakshi Sinha – Zaheer Iqbal : బాలీవుడ్ స్టార్ శత్రుఘ్న సిన్హా కూతురు, హీరోయిన్ సోనాక్షి సిన్హా పెళ్లి నిన్న నటుడు జహీర్ ఇక్బల్ తో ఘనంగా జరిగింది. ఏడేళ్లుగా సోనాక్షి సిన్హా నటుడు జహీర్ ఇక్బల్ తో ప్రేమలో ఉంది. ఈ ఇద్దరూ కలిసి ఓ సినిమాలో కూడా నటించారు. తాజాగా నిన్న పెళ్లిని రిజిస్టర్ మ్యారేజీ చేసుకొని రిసెప్షన్ వేడుకలు గ్రాండ్ గా చేసుకున్నారు ఈ జంట. వీరి రిసెప్షన్, పెళ్లి వేడుకలకు బాలీవుడ్ ప్రముఖులు చాలా మంది హాజరయ్యారు.

Also Read : Sonakshi Sinha : ఏడేళ్ల ప్రేమ ఒక్కటైంది.. ప్రేమ పెళ్లిపై బాలీవుడ్ భామ ఎమోషనల్ పోస్ట్..

ప్రస్తుతం సోనాక్షి – జహీర్ పెళ్లి ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పలువురు అభిమానులు, నెటిజన్లు, సెలబ్రెటీలు ఈ జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అయితే రిసెప్షన్ వేడుకల్లో ఈ జంట క్యూట్ గా డ్యాన్స్ చేసింది. ఇద్దరూ నటీనటులు కావడం, సోనాక్షి డ్యాన్సర్ కూడా కావడంతో ఈ జంట పెళ్ళిలో పలు పాటలకు మాస్ డ్యాన్స్, రొమాంటిక్ డ్యాన్స్ వేసి అలరించారు. దీంతో సోనాక్షి సిన్హా – జహీర్ ఇక్బల్ డ్యాన్స్ వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.