Balakrishna : ద‌టీజ్ బాల‌య్య‌.. ఫ్యాన్ నంబ‌ర్ ఫోన్‌లో సేవ్ చేసుకుని.. స‌ర్‌ప్రైజ్

బాల‌య్య ఫోన్ నంబ‌ర్ చాలా మంది ఫ్యాన్స్ ద‌గ్గ‌రే ఉంటుంది. అయితే..

Balakrishna surprise his fans by calling phone

సాధార‌ణంగా సినీ న‌టీన‌టుల‌కు ఉండే క్రేజ్ గురించి చెప్పాల్సిన ప‌ని లేదు. వారు ఎక్కడ క‌న‌బ‌డినా చాలు ఫోటోలు, సెల్పీలు తీసుకునేందుకు ఆస్తకి చూపిస్తుంటారు అభిమానులు. ఇక స్టార్ హీరోల‌కు ఉండే ఫ్యాన్ ఫాలోయింగ్ నెక్ట్స్ లెవ‌ల్ అని చెప్పాలి. త‌మ హీరో సినిమా రిలీజ్ అవుతుంది అంటే చాలు.. అభిమానులు చేసే హంగామా అంతా ఇంతా కాదు. జీవితంలో ఒక్క‌సారి అయినా ఇష్ట‌మైన హీరోని క‌ల‌వాల‌ని, క‌నీసం వారితో ఫోన్‌లో మాట్లాడాల‌ని ప్ర‌య‌త్నించే ఫ్యాన్ చాలా మందే ఉంటారు.

హీరోల ఫోన్ నంబ‌ర్ల కోసం చాలా ప్ర‌య‌త్నాలే చేస్తుంటారు. హీరో నంబ‌ర్ కాదుక‌దా క‌నీసం హీరో టీమ్ నెంబ‌ర్ కూడా సంపాదించ‌డం చాలా క‌ష్టం. అలాంటిది ఓ స్టార్ హీరో ఫోన్ నేరుగా చేసి అభిమానుల‌తో మాట్లాడితే.. స‌ద‌రు ఫ్యాన్స్‌ ఆనందం మాట‌ల్లో వ‌ర్ణించ‌డానికి వీలుండ‌దు. అలాంటి ఆనంద‌లోనే ఉన్నారు ప్ర‌స్తుతం ఈ బాల‌య్య అభిమానులు.

పుష్ప-2‎ని టార్గెట్ చేసిన దేవర

తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లో ఎంతో మంది హీరోలు ఉన్నా.. సీనియ‌ర్ న‌టుడు బాల‌కృష్ణ రూటే స‌ప‌రేటు. ఆయ‌న ఏం చేసినా స‌రే ఫ్యాన్స్ పూన‌కాల‌తో ఊగిపోతుంటారు. న‌ట‌న‌తోనే కాదు వ్య‌క్తిత్వంతోనూ బాల‌య్య అభిమానుల‌కు ఎంతో ద‌గ్గ‌ర అయ్యారు. బాల‌య్య ఫోన్ నంబ‌ర్ చాలా మంది ఫ్యాన్స్ ద‌గ్గ‌రే ఉంటుంది. వాళ్లు ఫోన్ చేస్తే బాల‌య్య ఎంతో హుషారుగా మాట్లాడుతూ ఉంటారు. ఒక్కొసారి ఫోన్ ఆన్స‌ర్ చేసే ప‌రిస్థితుల్లో లేక‌పోతే ఆ త‌రువాత మ‌ళ్లీ తిరిగి ఫోన్ చేస్తూ ఉంటారు.

అలాంటి ఓ సంఘ‌ట‌న‌కు సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. స్టార్ హీరోల ఫోన్ నంబ‌ర్లు చాలా మంది ఫ్యాన్స్ ద‌గ్గ‌ర ఉన్నా కూడా ఫ్యాన్స్ ఫోన్ నంబ‌ర్ హీరోల ద‌గ్గ‌ర ఉండ‌డం అరుదు. ఫ్యాన్స్ ఫోన్ చేస్తే కూడా మాట్లాడడానికి కొంద‌రు అయిష్ట‌త చూపుతూ ఉంటారు. అలాంటిది మ‌ళ్లీ కాల్ చేసి మాట్లాడ‌డం ఒక్క బాల‌య్యకే సాధ్యం.. ద‌టీజ్ బాల‌య్య‌, జై బాల‌య్య అంటూ నెటిజ‌న్లు కామెంట్లు చేస్తున్నారు.

Anjali : సినిమా బాగోలేదని నాకెవ్వరూ చెప్పలేదు.. గేమ్ ఛేంజర్ రిజల్ట్ పై అంజలి కామెంట్స్..

కాగా.. ఇటీవ‌లే బాల‌కృష్ణ‌కు కేంద్ర ప్ర‌భుత్వం ప‌ద్మ భూష‌ణ్ అవార్డును ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ఇక సినిమాల విష‌యానికి వ‌స్తే.. ఇటీవ‌లే డాకు మ‌హారాజ్ చిత్రంతో బాలకృష్ణ ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చారు. బాబీ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ చిత్రం సంక్రాంతి కానుక‌గా విడుద‌లైంది. మంచి విజ‌యాన్ని అందుకుంది. థియేట‌ర్ల వ‌ద్ద క‌లెక్ష‌న్ల సునామీ సృష్టిస్తోంది. ప్ర‌స్తుతం బాల‌య్య అఖండ 2 మూవీ చేస్తున్నారు. బోయ‌పాటి శ్రీను ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో ప్ర‌గ్య జైస్వాల్‌, సంయుక్త‌ క‌థానాయిక‌లు. అఖండ మూవీకి సీక్వెన్‌గా వ‌స్తున్న ఈ చిత్రంపై ప్రేక్ష‌కుల్లో భారీ అంచ‌నాలే ఉన్నాయి.