పుష్ప-2‎ని టార్గెట్ చేసిన దేవర

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నార్త్ ఆడియన్స్‌కు అట్రాక్ట్ చేసే ప్లాన్ చేస్తున్నాడు.

పుష్ప-2‎ని టార్గెట్ చేసిన దేవర

Updated On : January 28, 2025 / 11:55 AM IST

Gossip Garage : తెలుగు సినిమా దునియాను ఏలుతోంది. యావత్‌ ప్రపంచం టాలీవుడ్‌ హీరోలు, మూవీస్‌ గురించే మాట్లాడుకుంటోంది. ఈ నేపథ్యంలో తాను ప్యాన్‌ ఇండియా స్టార్ కావాలని.. తన మూవీ కూడా రికార్డుల మీద రికార్డులు క్రియేట్‌ చేయాలని ప్లాన్ చేస్తుంటారు హీరోలు. ఇప్పటికే RRRతో వెండితెర మీద పెరిగి..బ్లాక్‌బస్టర్‌ హిట్‌ కొట్టి..ఆస్కార్‌ వేదిక వరకు వెళ్లిన జూనియర్‌ ఎన్టీఆర్‌..ఇప్పుడు సరికొత్త స్ట్రాటజీని ఫాలో అవుతున్నాడట. అల్లుఅర్జున్‌ను బీట్‌ చేయాలని ప్లాన్ చేస్తున్నాడట.

వరల్డ్ వైడ్ కలెక్షన్స్‌తో పుష్ప-2 సినిమా 2 వేల కోట్ల క్లబ్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతుంది. పుష్ప-2 నార్త్‌లో బాగా క్లిక్‌ అయింది. అక్కడి ఫ్యాన్స్ బన్నీని బాగా రిసీవ్‌ చేసుకున్నారు. దాంతో మిగతా స్టార్స్‌ కూడా నార్త్‌పై ఎక్కువ ఫోకస్ పెట్టారట. యంగ్ టైగర్ ఎన్టీఆర్ నార్త్ ఆడియన్స్‌కు అట్రాక్ట్ చేసే ప్లాన్ చేస్తున్నాడు.

Anjali : సినిమా బాగోలేదని నాకెవ్వరూ చెప్పలేదు.. గేమ్ ఛేంజర్ రిజల్ట్ పై అంజలి కామెంట్స్..

బాలీవుడ్‌లో ఆల్రెడీ వార్‌-2 మూవీ చేస్తున్న తారక్‌..తర్వాత ప్రశాంత్‌ నీల్‌తో చేసే డ్రాగన్, కొరటాల శివతో చేసే దేవర-2..నార్త్‌లో బాగా క్లిక్ అయ్యేలా..మేకింగ్‌తో పాటు స్టోరీలో ఛేంజెస్ చేసుకుంటున్నాడని టాక్.

Balakrishna : అఖండ 2 సెట్స్ లో అడుగు పెట్టిన బాలయ్య.. తాండవం షురూ.. పద్మ భూషణుడికి గ్రాండ్ వెల్కమ్..

దేవర పార్ట్-1 అంతగా క్లిక్ అవ్వకపోవడంతో దేవర-2కి పుష్ప లెవల్‌లో బజ్ క్రియేట్ చేయాలనుకుంటున్నాడట. అందుకోసం కంటెంట్ చేంజ్ చేస్తున్నారట. పుష్ప-2ను రిఫరెన్స్‌గా తీసుకోని మాస్ ఆడియన్స్‌కు రీచ్ అవ్వటమే టార్గెట్‌గా పెట్టుకున్నారని అంటున్నారు. దేవర-2 స్ర్కిప్ట్‌లో చాలా మార్పులు జరుగుతున్నట్లు టాక్. ఇలా అల్లుఅర్జున్‌ పుష్ప-2ను బీట్ చేయడమే లక్ష్యంగా..అప్‌కమింగ్‌ మూవీస్‌ స్టోరీస్ చేంజ్‌ చేయడంతో పాటు మాస్‌ ఎలిమెంట్స్ యాడ్ చేస్తున్నాడట తారక్. చూడాలి మరి ఎన్టీఆర్‌ ప్లాన్ ఎంతవరకు వర్కౌట్‌ అవుతుందో.