Anjali : సినిమా బాగోలేదని నాకెవ్వరూ చెప్పలేదు.. గేమ్ ఛేంజర్ రిజల్ట్ పై అంజలి కామెంట్స్..

తాజాగా గేమ్ ఛేంజర్ సినిమా ఫలితంపై అంజలి మాట్లాడింది.

Anjali : సినిమా బాగోలేదని నాకెవ్వరూ చెప్పలేదు.. గేమ్ ఛేంజర్ రిజల్ట్ పై అంజలి కామెంట్స్..

Anjali Reacts on Ram Charan Shankar Game Changer Movie Result

Updated On : January 27, 2025 / 9:50 PM IST

Anjali : ఇటీవల సంక్రాంతికి రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. శంకర్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాణంలో రామ్ చరణ్ డ్యూయల్ రోల్ లో ఈ సినిమాని భారీ బడ్జెట్ తో తెరకెక్కించారు. ఇందులో అంజలి, కియారా అద్వానీ హీరోయిన్స్ గా నటించగా SJ సూర్య, శ్రీకాంత్, సునీల్, రాజీవ్ కనకాల, జయరాం.. ఇలా పలువురు స్టార్స్ నటించారు. శంకర్ డైరెక్షన్లో సినిమా అవ్వడంతో ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి.

కానీ గేమ్ ఛేంజర్ సినిమా మిశ్రమ స్పందన తెచ్చుకుంది. దానికి తోడు వేరే హీరోల ఫ్యాన్స్ కొంతమంది టార్గెట్ చేసి మరీ సినిమాకు నెగిటివ్ ప్రచారం చేయడంతో సినిమా ఆశించినంత విజయం సాధించలేదు. శంకర్ స్టైల్ లో ఓ మంచి మెసేజ్ సినిమా ఇచ్చినా ప్రేక్షకులు అంతగా ఆదరించలేదు. ఈ సినిమాలో అంజలి పార్వతి పాత్రలో రామ్ చరణ్ భార్యగా నటించింది. అలాగే ముసలి పాత్రలో కూడా మెప్పించింది.

Also Read : Balakrishna : అఖండ 2 సెట్స్ లో అడుగు పెట్టిన బాలయ్య.. తాండవం షురూ.. పద్మ భూషణుడికి గ్రాండ్ వెల్కమ్..

విశాల్, అంజలి, వరలక్ష్మి శరత్ కుమార్ నటించిన మదగజరాజ సినిమా తెలుగులో రిలీజ్ కాబోతుంది. ఇటీవల సంక్రాంతికి తమిళ్ లో రిలీజయి ఇప్పుడు తెలుగులో రిలీజవుతుంది. ఈ సినిమా జనవరి 31న రిలీజ్ కానుంది. నేడు ఈ సినిమా ఈవెంట్ నిర్వహించగా అంజలి, వరలక్ష్మి వచ్చారు. ఈ క్రమంలో మీడియాతో మాట్లాడగా అంజలికి గేమ్ ఛేంజర్ సినిమా ఫలితం గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి.

దీనికి అంజలి సమాధానమిస్తూ.. ఒక యాక్టర్ గా నేను నా రెస్పాన్సిబిలిటీని పూర్తిచేశాను. ఈ పాత్రకు నేను 200 శాతం పనిచేసాను. అదే నా భాధ్యత. సినిమాని ఆడించడానికి ప్రమోషన్స్ చేస్తాం, జనాల దగ్గరకు వెళ్తాము అవన్నీ చేసాము. ఈ సినిమాని నేను చాలా నమ్మాను. ఈ సినిమా విషయంలో నేను హ్యాపీనే. ఎందుకంటే సినిమా చూసిన జనరల్ ఆడియన్స్ ఎవరూ సినిమా బాగోలేదని చెప్పలేదు. ఒక మంచి సినిమా చూసాం అని చెప్పారు. సినిమా బాగుండటం వేరు.. మంచి సినిమా వేరు. గేమ్ ఛేంజర్ మంచి సినిమా, మీరు చాలా బాగా చేసారు అని చెప్పారు. నాకు అది చాలు. ఇలా జరిగితే కొన్ని సార్లు బాధపెడుతోంది అని చెప్పింది.

Also Read : Saif Ali Khan : సైఫ్ అలీ ఖాన్ పై దాడి కేసులో మహిళా అరెస్ట్.. ముంబైలో దాడి.. బెంగాల్ లో అరెస్ట్..

సంక్రాంతికి సినిమాలు రిలీజ్ అవ్వడం గురించి మాట్లాడుతూ.. ఏ యాక్టర్ కి అయినా సంక్రాతికి సినిమా రిలీజ్ అవ్వాలని ఉంటుంది. సంక్రాంతికి సినిమా వస్తే ఇంకా హైప్ ఉంటుంది. సంక్రాంతికి వస్తే సినిమా బాగున్నా బాగోలేకపోయినా సినిమా చూస్తారు అని చెప్పింది. దీంతో అంజలి కామెంట్స్ వైరల్ గా మారాయి.