Balakrishna : అఖండ 2 సెట్స్ లో అడుగు పెట్టిన బాలయ్య.. తాండవం షురూ.. పద్మ భూషణుడికి గ్రాండ్ వెల్కమ్..
పద్మ భూషణ్ వచ్చాక సెట్స్ లో అడుగుపెట్టడంతో మూవీ యూనిట్ పూలు జల్లి బాలయ్యకు గ్రాండ్ వెల్కమ్ చెప్పారు.

Balakrishna Enters into Akhanda 2 Movie Sets Celebrations Video goes Viral
Balakrishna : వరుస ఫామ్ లో ఉన్న బాలయ్య ఇటీవల డాకు మహారాజ్ సినిమాతో సంక్రాంతికి పలకరించాడు. ఈ సినిమా భారీ విజయం సాధించి 160 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. వరుసగా నాలుగు హిట్ సినిమాల తర్వాత మరో హిట్ కాబోతున్న సినిమాలోకి అడుగు పెట్టాడు. బాలయ్య సెకండ్ ఇన్నింగ్స్ కి పునాది వేసిన అఖండ సినిమాకు సీక్వెల్ ప్రకటించిన సంగతి తెలిసిందే.
తాజాగా అఖండ 2 సెట్స్ లోకి బాలకృష్ణ అడుగుపెట్టారు. ఇప్పటికే ప్రయాగ్ రాజ్ లో జరుగుతున్న మహా కుంభమేళాలో అఖండ 2 కి సంబంధించిన కొన్ని సీన్స్ షూట్ చేసారు. నేటి నుంచి ఈ సినిమా షూటింగ్ రామోజీ ఫిలిం సిటీలో ప్రారంభమైంది. బాలకృష్ణ నేటి నుంచి షూటింగ్ లో పాల్గొంటున్నారు. అయితే బాలయ్యకు ఇటీవలే పద్మ భూషణ్ ప్రకటించిన సంగతి తెలిసిందే.
Also Read : Saif Ali Khan : సైఫ్ అలీ ఖాన్ పై దాడి కేసులో మహిళా అరెస్ట్.. ముంబైలో దాడి.. బెంగాల్ లో అరెస్ట్..
పద్మ భూషణ్ వచ్చాక సెట్స్ లో అడుగుపెట్టడంతో మూవీ యూనిట్ పూలు జల్లి బాలయ్యకు గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. బాలయ్యతో కేక్ కట్ చేయించారు. మూవీ యూనిట్ అంతా బాలయ్యకు అవార్డు రావడంపై సంతోషం వ్యక్తం చేసారు. అఖండ 2లో సెలబ్రేషన్స్ వీడియోని రిలీజ్ చేసారు మూవీ యూనిట్. ఇక ఈ సినిమాని బాలయ్య రెండో కూతురు తేజస్విని సమర్పణలో 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీ ఆచంటలు తెరకెక్కిస్తున్నారు. బాలయ్య సూపర్ హిట్ కాంబో డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుండగా ఇందులో ప్రగ్య జైస్వాల్, సంయుక్త మీనన్ లు హీరోయిన్స్ గా నటిస్తున్నారు.
ఈ సినిమాలో సంజయ్ దత్ నెగిటివ్ రోల్ లో కనిపిస్తాడని వార్తలు వస్తున్నాయి. ఇక ఈ సినిమాకు తమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. అఖండ 2 దసరా కానుకగా సెప్టెంబర్ 25న రిలీజ్ చేయనున్నారు. నేటి నుంచి అఖండ 2 షూట్ మొదలయిందని తెలియడంతో ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అఖండకు మించి ఈ సినిమాలో బాలయ్య తాండవం చూస్తారని అంటున్నారు.