Veera Simha Reddy : వీరసింహుడి 100 రోజుల విజయోత్సవం.. గెట్ రెడీ NBK ఫ్యాన్స్!

బాలకృష్ణ నటించిన రీసెంట్ బ్లాక్ బస్టర్ వీరసింహారెడ్డి.. 100 డేస్ ఫంక్షన్ కి సిద్దమవుతుంది. ఆ ఈవెంట్ ఎప్పుడు జరగబోతుందో తెలుసా?

Balakrishna Veera Simha Reddy 100 days function date

Veera Simha Reddy : అఖండ వంటి బ్లాక్ బస్టర్ తరువాత నందమూరి బాలకృష్ణ (Balakrishna) నటించిన సినిమా వీరసింహారెడ్డి. సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ సినిమాని గోపీచంద్ మలినేని డైరెక్ట్ చేశాడు. సీమ కథతో ఒకప్పటి వింటేజ్ బాలకృష్ణను చూపిస్తూనే సిస్టర్ సెంటిమెంట్ తో ఆడియన్స్ చేత కన్నీళ్లు కూడా పెట్టించాడు. శృతిహాసన్, హనీ రోజ్ హీరోయిన్లుగా కనిపించగా వరలక్ష్మి శరత్ కుమార్, దునియా విజయ్ ప్రధాన పత్రాలు పోషించారు. ఇక బాక్స్ ఆఫీస్ వద్ద ఈ చిత్రం 130 కోట్లకు పైగా కలెక్షన్స్ అందుకొని అఖండ తరువాత స్థానంలో హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచింది.

NBK108 : యాక్షన్ సీక్వెన్స్‌లో బాలయ్య.. NBK108 నుంచి వీడియో లీక్!

కాగా ఈ సినిమా థియేటర్ లో ఇంకా రన్ అవుతుంది. ఏప్రిల్ 21 తో ఈ సినిమా 100 రోజులు పూర్తి చేసుకోబోతుంది. దీంతో చిత్ర నిర్మాతలు 100 డేస్ ఫంక్షన్ ని ఏప్రిల్ 23న గ్రాండ్ గా సెలబ్రేట్ చేయబోతున్నారు. ఈ ఈవెంట్ ఎక్కడ నిర్వహించబోతున్నారు, ఎవరెవరు హాజరు కాబోతున్నారు అనేది త్వరలోనే తెలియజేస్తాం అంటూ వెల్లడించారు. కాగా బాలకృష్ణ ప్రస్తుతం NBK108 సినిమాలో నటిస్తున్నాడు. అనిల్ రావిపూడి ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నాడు. ఇప్పటికే పలు షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.

Nandamuri Balakrishna: నాకు మించిన సైకాలజిస్ట్ లేరు, నేను అందరి సైకాలజీ చెబుతా..

ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal) బాలయ్యకి జంటగా నటిస్తుండగా మరో హీరోయిన్ శ్రీలీల (Sreeleela) ముఖ్య పాత్రలో నటిస్తుంది. ఈ ఇద్దరు భామలు కూడా ఇటీవలే ఈ మూవీ సెట్ లోకి అడుగు పెట్టారు. ఇక ఈ చిత్రం నుంచి రిలీజ్ అయిన బాలయ్య ఫస్ట్ లుక్ పోస్టర్ అందర్నీ ఆకట్టుకుంటుంది. ఎస్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాతో కూడా హిట్టు కొట్టి హ్యాట్రిక్ సక్సెస్ ని అందుకుందామని ప్రయత్నిస్తున్నాడు బాలకృష్ణ.