Balakrishna will play a Super Hero Massive Role Interesting Details Soon
Balakrishna : బాలకృష్ణ గత కొన్నాళ్లుగా ఫుల్ ఫామ్ లో ఉన్నారు. బ్యాక్ టు బ్యాక్ మూడు సినిమాలతో 100 కోట్ల హిట్ కొట్టారు. మరో పక్క ఆహా ఓటీటీలో అన్‌స్టాపబుల్ షో, మరో పక్క హిందూపూర్ లో మూడో సారి ఎమ్మెల్యేగా గెలిచి హ్యాట్రిక్ గెలుపు.. ఇలా బాలయ్య ఫుల్ ఫామ్ లో ఉండటంతో ఫ్యాన్స్ కూడా హ్యాపీగా ఉన్నారు. అయితే గత మూడు రోజులుగా టాలీవుడ్ లో ఓ వార్త వైరల్ అవుతుంది.
బాలకృష్ణ సూపర్ హీరోగా ఓ మాసివ్ సినిమా రాబోతుందని సమాచారం. దసరా కానుకగా దీనికి సంబంధించిన అప్డేట్ రేపు అక్టోబర్ 12న వస్తుందని సమాచారం. బాలయ్య కొత్త మాస్ సూపర్ హీరో తరహా పాత్రలో కనిపిస్తారని, ఇందులో ఐశ్వర్య రాయ్ హీరోయిన్ గా ఉండొచ్చని టాక్ కూడా వినిపిస్తుంది. దీంతో ఈ వార్త వైరల్ గా మారింది.
Also Read : Viswam : ‘విశ్వం’ మూవీ రివ్యూ.. ఆరేళ్ళ తర్వాత శ్రీను వైట్ల రీ ఎంట్రీ సినిమా ఎలా ఉంది..?
దీనికి సంబంధించి రేపు గ్రాండ్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి బాలయ్యని సరికొత్తగా చూపించబోతున్నారని తెలుస్తుంది. ఇక ఈ పాత్ర టాలీవుడ్ లోనే కాక ఇండియన్ సినిమాలో కూడా సరికొత్త సెన్సేషన్ సృష్టిస్తుంది అని అంటున్నారు. దీంతో బాలయ్య ఫ్యాన్స్ ఆసక్తిగా ఈ అప్డేట్ కోసం ఎదురుచూస్తున్నారు. అసలు బాలయ్య సూపర్ హీరో అవతారం ఏంటి తెలియాలంటే రేపటి దాకా ఎదురుచూడాల్సిందే.