Unstoppable With NBK Show Latest Episode Promo with Ram Charan
Unstoppable With NBK: ప్రముఖ ఓటీటీ ఆహాలో నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా చేస్తున్న అన్‌స్టాపబుల్ షో నాలుగో సీజన్ దూసుకుపోతుంది. ఇప్పటికే ఎనిమిది ఎపిసోడ్స్ స్ట్రీమింగ్ అవ్వగా అదిరిపోయే స్పందన వచ్చింది. తొమ్మిదో ఎపిసోడ్‌కు గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్ గెస్ట్‌గా వచ్చారు. ఈ ఎపిసోడ్‌కి చరణ్‌తో పాటు హీరో శర్వానంద్, నిర్మాత్ దిల్ రాజు, విక్రమ్‌లు సైతం వచ్చారు. ఇప్పటికే ఈ ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రొమో విడుదలైన సంగతి తెలిసిందే.
ఇక ఎపిసోడ్ మొత్తం సరదా సరదాగా సాగినట్లు తెలుస్తోంది. సమంత, కియారా అద్వానీ, అలియా భట్‌లలో ఉత్తమ నటిని ఎన్నుకోమని రామ్‌చరణ్‌ను హోస్ట్ బాలయ్య అడిగారు. ఈ ముగ్గురితో చరణ్ నటించిన సంగతి తెలిసిందే.
Allu Arjun : శ్రీతేజ్‌ను పరామర్శించిన అల్లు అర్జున్..
ఈ ముగ్గురిలో సమంతను ఉత్తమ నటిగా చరణ్ ఎన్నుకున్నారట. ఇంకా వారి గురించి చరణ్ ఏమీ చెప్పారో తెలుసుకోవాలంటే పూర్తి ఎపిసోడ్ స్ట్రీమింగ్ అయ్యే వరకు వెయిట్ చేయక తప్పదు.
ఇంకా తన కూతురు కింక్లారా గురించి చరణ్ మాట్లాడారు. ప్రభాస్ కాల్ చేసి మాట్లాడారు. శర్వానంద్ వచ్చి చరణ్‌తో ఉన్న స్నేహం గురించి మాట్లాడారు. ఇక చరణ్, బాలయ్య కలిసి గేమ్ ఛేంజర్ పాటకు డ్యాన్స్ చేశారు. ఈ ఎపిసోడ్ కోసం మెగా, నందమూరి ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. ఈ ఎపిసోడ్ బుధవారం (జనవరి 8) న ఆహాలో స్ట్రీమింగ్ కానుంది.
SSMB 29 : రాజమౌళి – మహేష్ బాబు సినిమాపై కూడా డాక్యుమెంటరీ.. అందుకే పూజ కార్యక్రమం సీక్రెట్ గా..?
ఇక రామ్‌చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ మూవీ జనవరి 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. శంకర్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. కియారా అద్వానీ కథానాయిక. దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు. అంజలి, ఎస్‌జే సూర్య, శ్రీకాంత్‌లు కీలక పాత్రలను పోషించారు. ఈ చిత్రం పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి.