×
Ad

Bandi Saroj Kumar : వాట్.. బండి సరోజ్ కుమార్ కి పెళ్లయిందా..? పదేళ్ల క్రితమే భార్య కొడుకుకు దూరంగా.. ఎందుకంటే?

తాజాగా సరోజ్ కుమార్ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన ఫ్యామిలీ గురించి మాట్లాడాడు. (Bandi Saroj Kumar)

Bandi Saroj Kumar

Bandi Saroj Kumar : నిర్బంధం, మాంగల్యం, సూర్యాస్తమయం, పరాక్రమం.. లాంటి పలు సినిమాలతో మంచి ఫేమ్ తెచ్చుకున్నాడు నటుడు, డైరెక్టర్ బండి సరోజ్ కుమార్. ఇన్నాళ్లు హీరోగా, దర్శకుడిగా మెప్పించిన సరోజ్ కుమార్ ఇటీవల మౌగ్లీ సినిమాలో విలన్ గా కూడా తన నటనతో మెప్పించాడు. బండి సరోజ్ కుమార్ ఎప్పుడో 2010 లోనే దర్శకుడిగా తమిళ్ లో మొదటి సినిమా చేసాడు. దాదాపు 15 ఏళ్లకు పైగా సినీ పరిశ్రమలో ఉన్నాడు.(Bandi Saroj Kumar)

తాజాగా సరోజ్ కుమార్ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన ఫ్యామిలీ గురించి మాట్లాడాడు. తనకు పెళ్లి అయి విడిపోయిన విషయం చెప్పాడు.

Also Read : Alekhya Harika : తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్ వివాదం.. అయిదేళ్ల తర్వాత స్పందించిన దేత్తడి హారిక..

సరోజ్ కుమార్ మాట్లాడుతూ.. నాకు సినిమా తప్ప దేని మీద వ్యామోహం లేదు. నా విషయంలో ఇదే కరెక్ట్. తల్లి, తండ్రి, భార్య, కొడుకు.. ఇలాంటి బంధాలు నాకు సెట్ అవ్వవు. నాకు బాబు పుట్టి పదేళ్లు అయింది. అందరూ కొడుకు పుడితే ఎమోషన్ ఉంటది, ఫీలింగ్ ఉంటది, ఫస్ట్ టైం ఎత్తుకుంటే ఎమోషన్ ఉంటుంది అని ఏదేదో చెప్తారు కానీ నాకు ఆ ఫీలింగ్ రాలేదు. నా భార్య కూడా నాకు ఫీలింగ్స్, ఎమోషన్స్ వస్తాయేమో, మారతాడేమో అని ఆశించింది. నేను ఎలా ఉంటానో పెళ్ళికి ముందే ఆమెకు తెలుసు. కానీ నేను మారతాను అనుకున్నాను అంది.

నేను ఎలా మారతాను. నేను మొదట్నుంచి ఇంతే కదా. ఆమెకు కొడుకు కావాలి అందుకే కన్నాను. కొడుకు పుట్టిన సంవత్సరం తర్వాత వాడ్ని చూసాను. మళ్ళీ చూడలేదు. పదేళ్లు అయిపోయింది. అసలు వాళ్ళతో కాంటాక్ట్ లో లేను. ఆమె తమిళ్ అమ్మాయి. వాళ్ళు చెన్నైలో ఉంటారు. బాబు ఫోటో కూడా లేదు నా దగ్గర. నేను వాళ్ళతో మాట్లాడను. వాళ్ళే రెండేళ్లకు ఒకసారి ఎప్పుడో మెసేజ్ చేస్తారు కానీ నేను పట్టించుకోను. బంధాలు అంటే కమిట్మెంట్ లేదు నాకు. నేను ఎవరితో రిలేషన్ లో ఉండను. గతంలో ఎవరో ఒకరు అమ్మాయి ఉండేవాళ్లు టైం పాస్ కి అంతే. కానీ ఒక సంవత్సరం నుంచి బ్రహ్మచర్యం పాటిస్తున్నాను అని తెలిపారు.

Also See : Faria Abdullah : చీరలో చిట్టి.. ఫరియా అబ్దుల్లా మెరుపులు..

బండి సరోజ్ కుమార్ వ్యాఖ్యలు వైరల్ అవ్వగా తనకి ఎప్పుడో పదేళ్ల కంటే ముందే తమిళ పరిశ్రమలో ఉన్నపుడు అక్కడ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకొని కొడుకు కూడా పుట్టిన తర్వాత విడిపోయారని తెలుస్తుంది. కానీ ఆ అమ్మాయి ఎవరు అనేది మాత్రం చెప్పలేదు. దీంతో సరోజ్ కుమార్ కి పెళ్లయిందా అని పలువురు ఆశ్చర్యపోతున్నారు.