Bandi Saroj Kumar Turned as Villain for Roshan Kanakala Mowgli Movie
Mowgli : ఇటీవల కమెడియన్లు, హీరోలు విలన్స్ గా మారుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మరో హీరో కం దర్శకుడు విలన్ గా మారుతున్నాడు. యాంకర్ సుమ కొడుకు రోషన్ కనకాల హీరోగా బబుల్ గమ్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మోగ్లీ అనే టైటిల్ తో తన రెండో సినిమా చేస్తున్నాడు. కలర్ ఫోటో డైరెక్టర్ సందీప్ రాజ్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది.
Also Read : Mad Square Collections : దుమ్ములేపుతున్న మ్యాడ్ స్క్వేర్.. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం..
తాజాగా నేడు మోగ్లీ సినిమాలో విలన్ ని పరిచయం చేసారు. ఈ సినిమాలో పబ్లిక్ స్టార్ బండి సరోజ్ కుమార్ విలన్ గా నటిస్తున్నాడు. బండి సరోజ్ కుమార్ గతంలో నిర్బంధం, మాంగల్యం, సూర్యాస్తమయం.. లాంటి పలు బోల్డ్ సినిమాలతో పాపులర్ అయ్యాడు. హీరోగా, దర్శకుడిగా ఈ సినిమాలను తెరకెక్కించాడు. ఇటీవల ‘పరాక్రమం’ అనే సినిమాతో కూడా మెప్పించాడు. తమిళ్ లో కూడా ఓ రెండు సినిమాలు డైరెక్షన్ చేసాడు.
ఇన్నాళ్లు హీరోగా, దర్శకుడిగా సినిమాలు తీసిన బండి సరోజ్ కుమార్ ఇప్పుడు విలన్ గా మారాడు. రోషన్ కనకాల మోగ్లీ సినిమాలో నోలన్ అనే నెగిటివ్ పాత్రలో కనిపించబోతున్నాడు. నేడు సరోజ్ కుమార్ ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేసారు. ఈ పోస్టర్ లో సరోజ్ కుమార్ క్యాండిల్ తో సిగరెట్ వెలిగించుకున్నట్టు ఉంది. ఇందులో నెగిటివ్ పోలీస్ పాత్రలో నటించబోతున్నట్టు తెలుస్తుంది.