Bandla Ganesh : ఎన్టీఆర్‌ కూడా నా దేవరనే.. దేవర టైటిల్ వివాదం.. బండ్లగణేష్ ని ట్రోల్ చేస్తున్న మెగా ఫ్యాన్స్..

ఎన్టీఆర్ 30వ సినిమాకు టైటిల్ దేవర అని ప్రకటించిన తర్వాత, గతంలో ఈ టైటిల్ గురించి బండ్ల ట్వీట్ చేయడంతో దాన్ని గుర్తుచేస్తూ ఓ నెటిజన్ ఎన్టీఆర్ 30 దేవర టైటిల్ ఎలా ఉంది అని అడిగారు.

Bandla Ganesh : ఎన్టీఆర్‌ కూడా నా దేవరనే.. దేవర టైటిల్ వివాదం.. బండ్లగణేష్ ని ట్రోల్ చేస్తున్న మెగా ఫ్యాన్స్..

Bandla Ganesh tweets on NTR 30th Movie title Devara goes viral

Updated On : May 20, 2023 / 5:53 PM IST

Devara :  తాజాగా ఎన్టీఆర్(NTR) 30వ సినిమాకు దేవర అనే టైటిల్ ప్రకటించారు. ఈ టైటిల్ చాలా పవర్ ఫుల్ గా ఉందని ఎన్టీఆర్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే గతంలోనే ఈ టైటిల్ ని బండ్ల గణేష్(Bandla Ganesh) పవన్ కళ్యాణ్(Pawan Kalyan) సినిమా కోసం రిజిస్టర్ చేయించినట్లు తెలిపారు. తాజాగా ఈ టైటిల్ పై మరోసారి బండ్ల గణేష్ చేసిన ట్వీట్స్ వైరల్ గా మారాయి.

ఎన్టీఆర్ 30వ సినిమాకు టైటిల్ దేవర అని ప్రకరించిన తర్వాత, గతంలో ఈ టైటిల్ గురించి బండ్ల ట్వీట్ చేయడంతో దాన్ని గుర్తుచేస్తూ ఓ నెటిజన్ ఎన్టీఆర్ 30 దేవర టైటిల్ ఎలా ఉంది అని అడిగారు. దీనికి బండ్ల గణేష్ సమాధానమిస్తూ.. దేవర నేను రిజిస్ట్రేషన్ చేయించుకున్న నా టైటిల్. నేను దాని రెన్యూవల్ చేయించడం మర్చిపోవడం వల్ల నా టైటిల్ కొట్టేశారు అని ట్వీట్ చేశారు. అయితే ఈ ట్వీట్ పై ఎన్టీఆర్ అభిమానుల నుంచి నెగిటివ్ కామెంట్స్ రావడంతో మళ్ళీ.. నాకేం ప్రాబ్లం లేదు బ్రదర్, ఇది మన యంగ్ టైగర్ సినిమాకే కదా, ఆయన కూడా నాకు దేవరే అని ట్వీట్ చేశారు.

NTR30 : ఎన్టీఆర్ బర్త్ డేకి అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన కళ్యాణ్ రామ్.. ‘దేవర’గా ఎన్టీఆర్ విశ్వరూపమే..

దీంతో ఈ సారి మెగా ఫ్యాన్స్ బండ్ల గణేష్ పై ఫైర్ అవుతూ ట్రోల్ చేస్తున్నారు. టైటిల్ అంతా ఈజీగా ఎలా వదిలేస్తావు, ఇన్నాళ్లు పవన్ ఫ్యాన్ అని చెప్పావు, ఇప్పుడు ఎన్టీఆర్ కి సపోర్ట్ గా పొగుడుతూ ట్వీట్స్ చేస్తున్నావు అంటూ పలువురు మెగా ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరోవైపు ఎన్టీఆర్ అభిమానులు బండ్ల గణేష్ కి సపోర్ట్ గా మెగా ఫ్యాన్స్ కి వ్యతిరేకంగా కామెంట్స్ చేస్తున్నారు. దీంతో మరోసారి సోషల్ మీడియాలో నందమూరి, మెగా వార్ జరుగుతోంది.