ప్రభాస్ ఫ్యాన్స్ కు కిక్కిచ్చే వార్త..త్వరలోనే రాధే శ్యామ్ సినిమా షూటింగ్

  • Published By: madhu ,Published On : August 23, 2020 / 08:35 AM IST
ప్రభాస్ ఫ్యాన్స్ కు కిక్కిచ్చే వార్త..త్వరలోనే రాధే శ్యామ్ సినిమా షూటింగ్

Updated On : August 23, 2020 / 9:03 AM IST

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ న్యూ ఫిల్మ్ ‘రాధే శ్యామ్’ నిలిచిపోయిన సినిమా షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. ఈ విషయాన్ని స్వయంగా రాధా క్రిష్ణ కుమార్ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. సెప్టెంబర్ 02వ వారంలో ప్రారంభం అవుతున్న షూటింగ్ పై ఎంతో ఉత్కంఠగా ఉందని, లాంగ్ షెడ్యూల్ లవ్లీగా ఉండబోతుందన్నారు.

ప్రభాస్ సరసన పూజా హెగ్డే నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే యూరప్ లో సినిమా షూటింగ్ ప్రారంభమైంది. కానీ కరోన కేసులు ఎక్కువ కావడంతో సినిమా షూటింగ్ ను తాత్కాలికంగా నిలిపివేశారు. చిత్ర యూనిట్ మొత్తం భారతదేశానికి తిరిగి వచ్చింది.

రెండు వారాల పాటు..ప్రభాస్ స్వీయ నిర్బంధంలోకి వెళ్లిపోయారు. తమ అభిమాన నటుడు ప్రభాస్ మళ్లీ షూటింగ్ లో పాల్గొంటున్నాడనే వార్త తెలుసుకున్న ఫ్యాన్స్ తెగ ఖుష్ అయిపోతున్నారు.

ప్రభాస్‌ హీరోగా రాధాకృష్ణ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ఇటలీ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ పీరియాడికల్‌ సినిమాను గోపీకృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్‌ సంస్థలు నిర్మిస్తున్నాయి. ఈ సినిమా చిత్రీకరణ దాదాపు 60 శాతం పూర్తయిందని సమాచారం.

త్వరగా సినిమాను కంప్లీట్ చేసి..ఈ సంవత్సరమే విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. కానీ కరోనా నేపథ్యంలో అది సాధ్యమౌతుందా ? అనే డౌట్స్ వినిపిస్తున్నాయి. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల కానుంది.

‘మహా నటి’ ఫేం నాగ్ అశ్విన్, బాలీవుడ్ డైరెక్టర్ ఓం రావత్ తో సినిమాల్లో ప్రభాస్ నటిస్తున్న సంగతి తెలిసిందే. బాహుబలి -2 తర్వాత..వచ్చిన సాహో..అభిమానులను అంతగా అలరించకపోయింది. దీంతో వచ్చే సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.