Bellamkonda Ganesh: స్కూటర్ ఎక్కిన స్వాతిముత్యం.. వచ్చేది ఎప్పుడంటే?

టాలీవుడ్ యంగ్ హీరోల్లో యాక్షన్ హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ప్రస్తుతం బాలీవుడ్‌లో ఛత్రపతి చిత్రాన్ని....

Bellamkonda Ganesh: స్కూటర్ ఎక్కిన స్వాతిముత్యం.. వచ్చేది ఎప్పుడంటే?

Bellamkonda Ganesh Swathimuthyam Gets Release Date

Updated On : June 14, 2022 / 9:09 PM IST

Bellamkonda Ganesh: టాలీవుడ్ యంగ్ హీరోల్లో యాక్షన్ హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ప్రస్తుతం బాలీవుడ్‌లో ఛత్రపతి చిత్రాన్ని రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఆయన సోదరుడు బెల్లంకొండ గణేష్ తెలుగులో హీరోగా పరిచయం అవుతున్నాడు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ‘స్వాతిముత్యం’ అనే సినిమాలో హీరోగా బెల్లంకొండ గణేష్ నటిస్తున్నాడు.

ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పనులు ముగించుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. అయితే తాజాగా ఈ సినిమా నుండి ఓ కొత్త పోస్టర్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఈ పోస్టర్‌లో చిత్ర రిలీజ్ డేట్‌ను కూడా అనౌన్స్ చేశారు. ఓ స్కూటీపై హీరో బెల్లంకొండ గణేష్, హీరోయిన్ వర్షా బొల్లమ్మ ఇద్దరు జాలీగా వెళ్తూ ఈ పోస్టర్‌లో కనిపిస్తున్నారు. ఇక ఈ సినిమాకు మేజర్ అసెట్‌గా ఈ చిత్ర టైటిల్ నిలవబోతుందని చిత్ర యూనిట్ అంటోంది. ‘స్వాతిముత్యం’ లాంటి క్లాసిక్ టైటిల్‌తోనే ఈ సినిమా ప్రేక్షకుల్లో ఆసక్తిని క్రియేట్ చేస్తుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.

ఈ సినిమాను ఆగస్టు 13న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. ఈ చిత్రాన్ని లక్ష్మణ్ కె కృష్ణ డైరెక్ట్ చేస్తుండగా, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఔట్ అండ్ ఔట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ మూవీగా రాబోతున్న ఈ ‘స్వాతిముత్యం’ ప్రేక్షకులను ఎంతమేర ఆకట్టుకుంటుందో చూడాలి.