బెల్లంబాబు రాక్షసన్ రీమేక్ ప్రారంభం
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కొత్త సినిమా ప్రారంభం..

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కొత్త సినిమా ప్రారంభం..
బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా మరో కొత్త సినిమా ప్రారంభమైంది. తమిళ్‌లో విష్ణు విశాల్, అమలా పాల్ జంటగా రూపొంది, బ్లాక్ బస్టర్ హిట్ అయిన రాక్షసన్ సినిమాకిది తెలుగు రీమేక్. రమేష్ వర్మ దర్శకత్వంలో, హవీష్ లక్ష్మణ్ కోనేరు ప్రొడక్షన్ బ్యానర్‌పై, కోనేరు సత్యనారాయణ నిర్మిస్తున్నాడు. ఈ రోజు పూజా కార్యక్రమాలతో, రామానాయుడు స్టూడియోలో ఈ సినిమాని ప్రారంభించారు. ముహూర్తపు సన్నివేశానికి హీరో హవీష్ క్లాప్ నివ్వగా, ప్రముఖ నిర్మాత కె.ఎల్.నారాయణ కెమెరా స్విచ్ఛాన్ చేసారు. ఈ సినిమా కోసం, సాయి తన లుక్‌ని మార్చుకుని, సరికొత్త లుక్‌లోకి మారిపోయాడు.
సస్పెన్స్ క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌గా రూపొందనున్న ఈ మూవీలో సాయి సరసన రాశీఖన్నా హీరోయిన్‌గా నటించనుందని తెలుస్తుంది. ఇవాళ్టి నుండే రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేసారు. గిబ్రాన్ సంగీత మందిస్తున్నాడు. ఇతర నటీనటులు, సాంకేతికనిపుణుల వివరాలు తెలియాల్సి ఉంది. సాయి ప్రస్తుతం తేజ డైరెక్షన్‌లో సీత మూవీ చేస్తున్నాడు.