Jaya Janaki Nayaka : ‘జయ జానకి నాయక’ సినిమాతో వరల్డ్ రికార్డు సృష్టించిన హీరో బెల్లంకొండ..

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ (Bellamkonda Sreenivas) జయ జానకి నాయక (Jaya Janaki Nayaka) సినిమాతో వరల్డ్ రికార్డు క్రియేట్ చేశాడు. అదేంటో తెలుసా?

Jaya Janaki Nayaka : బెల్లంకొండ సాయి శ్రీనివాస్ (Bellamkonda Sreenivas) పాన్ ఇండియా మార్కెట్ లోకి అడుగుపెట్టడానికి కంటే ముందే వరల్డ్ రికార్డునే సృష్టించేశాడు. శ్రీనివాస్ తన కెరీర్ లో మూడో సినిమాని స్టార్ డైరెక్టర్ బోయపాటి దర్శకత్వంలో జయ జానకి నాయక (Jaya Janaki Nayaka) తెరకెక్కించాడు. 2017లో వచ్చిన ఈ యాక్షన్ మూవీ మంచి విజయానే అందుకుంది. రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh) ఈ సినిమాలో హీరోయిన్ గా నటించగా.. ప్రగ్యా జైస్వాల్, జగపతిబాబు, శరత్ కుమార్, నందు వంటి భారీ తారాగణంతో భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు.

Chatrapathi Remake: సమ్మర్‌లో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తోన్న ‘ఛత్రపతి’

కాగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ప్రతి సినిమా యూట్యూబ్ లో హిందీ డబ్ అయ్యి రిలీజ్ అయ్యి భారీ వ్యూస్ సంపాదిస్తుంటాయి. ఈ క్రమంలోనే జయ జానకి నాయక సినిమా కూడా రిలీజ్ అయ్యింది. అయితే ఈ సినిమా నార్త్ ఆడియన్స్ కి విపరీతంగా నచ్చేసింది. దీంతో ఈ మూవీ ప్రపంచంలో ఏ సినిమా అందుకొని రికార్డుని క్రియేట్ చేసింది. యూట్యూబ్ లో 700 మిలియన్ వ్యూస్ సాధించిన మొదటి సినిమాగా జయ జానకి నాయక వరల్డ్ రికార్డు సృష్టించింది.

ఇక ఈ విషయం సోషల్ మీడియాలో రావడంతో, ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే, సాయి శ్రీనివాస్ ప్రస్తుతం హిందీలో ఛత్రపతి రీమేక్ లో నటిస్తున్నాడు. ఈ సినిమాని టాలీవుడ్ మాస్ డైరెక్టర్ వి వి వినాయక్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ మూవీతో సాయి శ్రీనివాస్ బాలీవుడ్ డెబ్యూట్ ఇవ్వబోతున్నాడు. ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమా రిలీజ్ డేట్ ని ఇటీవల అనౌన్స్ చేశారు. సమ్మర్ కానుకగా మే 12న రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. మరి యూట్యూబ్ సినిమాలతో నార్త్ లో క్రేజ్ ని సంపాదించుకున్న సాయి శ్రీనివాస్ ఎంట్రీతో హిట్టు అందుకుంటాడా? లేదా? చూడాలి.

ట్రెండింగ్ వార్తలు