Chatrapathi Remake: సమ్మర్‌లో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తోన్న ‘ఛత్రపతి’

టాలీవుడ్‌లో హీరో ప్రభాస్, దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘ఛత్రపతి’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుందో అందరికీ తెలిసిందే. తెలుగు హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఛత్రపతి హిందీ రీమేక్‌లో నటిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్‌ను మేకర్స్ అనౌన్స్ చేశారు.

Chatrapathi Remake: సమ్మర్‌లో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తోన్న ‘ఛత్రపతి’

Bellamkonda Sreenivas Chatrapathi Remake Locks Release Date

Chatrapathi Remake: టాలీవుడ్‌లో హీరో ప్రభాస్, దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘ఛత్రపతి’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుందో అందరికీ తెలిసిందే. పక్కా యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీగా ఈ సినిమాను రాజమౌళి తెరకెక్కించగా, ప్రభాస్ తన యాక్షన్‌తో ఈ సినిమాను నెక్ట్స్ లెవెల్‌కు తీసుకెళ్లాడు. ఇక ఈ సినిమాలో హీరో ఎలివేషన్ సీన్స్‌కు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఇప్పుడు ఈ సినిమాను హిందీలో రీమేక్ చేస్తున్నారు.

Chatrapathi VV Vinayak : ఛత్రపతి రీమేక్..రాజమౌళితో వినాయక్

తెలుగు హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఛత్రపతి హిందీ రీమేక్‌లో నటిస్తున్నాడు. ఎప్పుడో స్టార్ట్ అయిన ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్‌కు రెడీ అయ్యింది. అయితే కొన్ని కారణాల వల్ల ఈ సినిమా రిలీజ్ డేట్ మాత్రం చిత్ర యూనిట్ అనౌన్స్ చేయలేదు. దీంతో ఈ సినిమాను హిందీలో ఎప్పుడెప్పుడు రిలీజ్ చేస్తారా అని అందరూ ఆసక్తిగా చూస్తూ వస్తున్నారు. కాగా, తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్‌ను మేకర్స్ అనౌన్స్ చేశారు.

Chatrapathi Remake : బెల్లం బాబుకి నలుగురూ ‘నో’ చెప్పేశారు..

వేసవి కానుకగా ఈ సినిమాను మే 12న థియేటర్స్‌లో రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఇక ఈ సినిమాను టాలీవుడ్ మాస్ చిత్రాల దర్శకుడు వివి.వినాయక్ డైరెక్ట్ చేస్తుండటంతో బాలీవుడ్ వర్గాల్లో ఈ సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. నుష్రత్ బరుచా ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోండగా, పెన్ స్టూడియోస్ ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేస్తోంది. మరి ఛత్రపతి రీమేక్ మూవీకి బాలీవుడ్ జనాలు ఎలాంటి రెస్పాన్స్ ఇస్తారో చూడాలి.