Chatrapathi VV Vinayak : ఛత్రపతి రీమేక్..రాజమౌళితో వినాయక్

ఛత్రపతి రీమెక్ తీయడానికి దర్శకుడు వినాయక్ ప్రయత్నిస్తున్నారు. హిందీలో దీనిని రీమెక్ చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. వినాయక్ దర్శకత్వంలో బెల్లంకొండ శ్రీనివాస్ రీమెక్ చేస్తున్నారు. పెన్ స్టూడియోస్ నిర్మాణం చేస్తోంది.

Chatrapathi VV Vinayak : ఛత్రపతి రీమేక్..రాజమౌళితో వినాయక్

Vv Vinayak

Updated On : July 12, 2021 / 9:45 AM IST

Chatrapathi Hindi : ఛత్రపతి…టాలీవుడ్ లో ప్రభాస్ హీరోగా వచ్చిన ఈ సినిమా బాక్సాపీస్ ను షేక్ చేసింది. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీలో ప్రభాస్ చూపిన ఫెర్మామెన్స్ ..డైలాగ్స్ అదరగొట్టాయి. ప్రభాస్ కెరీర్ లో అద్భుతమైన చిత్రంగా నిలిచిపోయింది. 2005లో ఈ సినిమా వచ్చింది. కొన్ని సినిమాలు రీమెక్ వస్తుంటాయి. ప్రస్తుతం ఛత్రపతి రీమెక్ తీయడానికి దర్శకుడు వినాయక్ ప్రయత్నిస్తున్నారు. హిందీలో దీనిని రీమెక్ చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు.

Read More : Dalai Lama Birthday : లడఖ్‌లో దలైలామా పుట్టినరోజు వేడుకలు.. ఎల్ఐసీ వద్ద చైనీయుల నిరసన!

వినాయక్ దర్శకత్వంలో బెల్లంకొండ శ్రీనివాస్ రీమెక్ చేస్తున్నారు. పెన్ స్టూడియోస్ నిర్మాణం చేస్తోంది. సినిమా స్క్రిప్ట్ విషయంలో ఒరిజినల్ రైటర్ కె.విజయేంద్ర ప్రసాద్ చేత రైటింగ్ సహాయం తీసుకుంటామని వినాయక్ వెల్లడించారు. బాలీవుడ్ ఆడియన్స్ టేస్టుకు తగినట్టుగా కొన్ని మార్పులు .. చేర్పులు చేశారు. విజయేంద్ర ప్రసాద్ కి హిందీ సినిమాలు చేసిన అనుభవం ఉంది. అంతేగాకుండా..రాజమౌళితో మాట్లాడుతానని చెప్పారు. ప్రస్తుతం రాజమౌళి ఆర్ఆర్ఆర్ (RRR) సినిమాతో ఫుల్ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా పూర్తయిన అనంతరం వినాయక్ – రాజమౌళి మధ్య చర్చలు జరుగనున్నాయని తెలుస్తోంది.