Dalai Lama Birthday : లడఖ్‌లో దలైలామా పుట్టినరోజు వేడుకలు.. ఎల్ఐసీ వద్ద చైనీయుల నిరసన!

ప్రముఖ ఆధ్యాత్మిక గురువు, టిబెటన్ బౌద్ధమత అధిపతి దలైలామా పుట్టిన రోజు వేడుకలకు వ్యతిరేకంగా చైనీయులు నిరసన వ్యక్తం చేశారు. తూర్పు లడఖ్‌లోని డెమ్‌చోక్‌లో దలైలామా పుట్టినరోజు వేడుకలను భారతీయులు జరుపుకున్నారు.

Dalai Lama Birthday : లడఖ్‌లో దలైలామా పుట్టినరోజు వేడుకలు.. ఎల్ఐసీ వద్ద చైనీయుల నిరసన!

Chinese Protest Against Dalai Lama’s Birthday Celebrations

Dalai Lama birthday celebrations : ప్రముఖ ఆధ్యాత్మిక గురువు, టిబెటన్ బౌద్ధమత అధిపతి దలైలామా పుట్టిన రోజు వేడుకలకు వ్యతిరేకంగా చైనీయులు నిరసన వ్యక్తం చేశారు. తూర్పు లడఖ్‌లోని డెమ్‌చోక్‌లో దలైలామా పుట్టినరోజు వేడుకలను భారతీయులు జరుపుకున్నారు. ఈ క్రమంలో దలైలామా పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడాన్ని నిరసిస్తూ.. సింధు నదిపై వాస్తవ నియంత్రణ రేఖ (LIC) దగ్గరలో చైనీయులు బ్యానర్లను ప్రదర్శించారు.

డెమ్‌చోక్ సెక్టార్‌లోని చివరి స్థావరాలలో ఒకరైన కోయుల్ (Kakjung) అధిపతి Urgain Tsewang ప్రకారం… డ్రాగన్ ఆర్మీ సిబ్బంది చైనా పౌరులతో కలిసి ఐదు వాహనాల్లో రోడ్లపైకి వచ్చి కమ్యూనిటీ సెంటర్ నుంచి 200 మీటర్ల దూరంలో బ్యానర్లు పెంచారు. దలైలామా పుట్టినరోజు జరుపుకునే ప్రాంతంలో బ్యానర్లతో నిరసన వ్యక్తం చేశారు. సింధు నది పక్కనే ఉన్న కోయుల్ గ్రామంలోని Dola Tamgo వద్ద జూలై 6 ఉదయం 11 గంటలకు ఈ ఘటన జరిగింది.

చైనీయుల నిరసన బ్యానర్లపై ఏదో రాశారని, అది తమకు Mandarin అర్థం కాలేదని Tsewang అన్నారు. దాదాపు అరగంట సేపు నిరసన తెలిపారని చెప్పారు. దలైలామా పుట్టినరోజున నిరసన తెలిపిన ప్రాంతం తమ భూమిగా పేర్కొన్నారు. ఇది భారతదేశానికి చెందినదని ఆయన అన్నారు. ఈ మేరకు ఆయన కొన్ని వీడియోలను షేర్ చేశారు. అందులో ఎరుపు రంగులో పొడవైన బ్యానర్ పట్టుకుని చైనీయులు జెండాను మోస్తున్నట్టుగా కనిపించింది. చైనా చర్యపై ఆర్మీ అధికారులను సంప్రదించగా స్పందించలేదన్నారు. 10 రోజుల క్రితం కూడా చైనీయులు నిరసన వ్యక్తం చేశారని, తమ స్థానికులు సోలార్ పంప్ పై కూర్చొవడాన్ని వ్యతిరికేస్తూ నినాదాలు చేసినట్టు తెలిపారు.