Jailer Release : గట్లుంటదీ సూపర్‌స్టార్ క్రేజ్ అంటే.. ‘జైలర్’ రిలీజ్ రోజు బెంగళూరు, చెన్నై ఆఫీసులకు సెలవు, ఫ్రీగా టికెట్లు..
సూపర్‌స్టార్ రజనీకాంత్ (Rajinikanth) నటిస్తున్న చిత్రం 'జైలర్'(Jailer). నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో యాక్షన్ ఎంటర్టైనర్గా రూపుదిద్దుకుంటుంది. తమన్నా (Tamannaah) హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రాన్నిసన్ పిక్చర్స్ నిర్మిస్తోంది.
- Thota Vamshi Kumar
- Updated on- August 8, 2023 / 03:50 PM IST
Holiday on Jailer Release Day
Holiday on Jailer Release Day : సూపర్‌స్టార్ రజనీకాంత్ (Rajinikanth) నటిస్తున్న చిత్రం ‘జైలర్'(Jailer). నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో యాక్షన్ ఎంటర్టైనర్గా రూపుదిద్దుకుంటుంది. తమన్నా (Tamannaah) హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రాన్నిసన్ పిక్చర్స్ నిర్మిస్తోంది. కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ (Shiva Rajkumar), మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ (Mohanlal), రమ్య కృష్ణ లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా ఆగస్టు 10న ప్రేక్షకుల ముందుకు రానుంది.
వాస్తవానికి ‘రోబో’ చిత్రం తరువాత రజినీకాంత్‌కు ఆ స్థాయిలో హిట్ రాలేదు. ‘కబాలి’, ‘కాలా’, ‘2.0’, ‘దర్భార్’ వంటి సినిమాలు అంచనాలను అందుకోలేదు. ఇక ‘అన్నాత్తే’ అయితే డిజాస్టర్. ఈ నేపథ్యంలో ‘జైలర్’ సినిమాపై మొదట్లో ఎవ్వరికి పెద్దగా అంచనాలు లేవు. కానీ ఎప్పుడైతే ట్రైలర్ రిలీజ్ అయ్యిందో సినిమాపై భారీ అంచనాలే ఏర్పడ్డాయి. దాదాపు రెండేళ్ల తరువాత సూపర్ స్టార్ రజినీకాంత్ ను వెండితెరపై చూసేందుకు అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
Naatu Naatu : లండన్ వీధుల్లో 700 మంది ‘నాటు నాటు’ స్టెప్పు.. వీడియో చూశారా..?
రజినీకాంత్‌కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన సినిమా విడుదల అవుతుందంటే చాలు ఆఫీసులకు సెలవులు ఇవ్వడాన్ని ‘కబాలి’ విడుదల సమయంలోనే చూశాం. తాజాగా జైలర్ సినిమా విడుదల రోజున కొన్నిసంస్థలు తమ కార్యాలయాలకు సెలవులు ప్రకటించాయి. మరికొన్ని కంపెనీలు తమ ఉద్యోగులకు ఫ్రీగా జైలర్ సినిమా టికెట్లను అందిస్తున్నాయి.
‘యునో ఆక్వా కేర్’ అనే కంపెనీ జైలర్ సినిమా విడుదల సందర్భంగా ఉద్యోగులకు సెలవు ఇస్తున్నట్లు ప్రకటించింది. ఉద్యోగుల నుంచి హెచ్ఆర్ డిపార్ట్మెంట్కు లీవ్ రిక్వెస్టులు వెల్లువెత్తకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. అంతేకాదు తమ ఉద్యోగులు అందరికీ ఫ్రీగా జైలర్ సినిమా అందించనున్నట్లు వెల్లడించింది. చెన్నై, బెంగళూరు, తిరుచ్చి, తిరునెల్వేలి, చెంగల్పట్టు, మట్టుతావాని, అరపళయం, అలగప్పన్ నగర్ లకు చెందిన బ్రాంచ్‌లకు కూడా ఈ సెలవు వర్తిస్తుందని నోటీస్‌లో పేర్కొంది. ఈ కంపెనీ సెలవు నోటీస్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Bigg Boss 7 : బిగ్‌బాస్ లోకి తల్లీకూతుళ్లు.. నిజమేనా? సురేఖావాణి.. సుప్రీత..?
ఈ కంపెనీ మాత్రమే కాదు.. చెన్నై, తమిళనాడులోని మరికొన్ని సంస్థలు సైతం కూడా తమ కార్యాలయాలకు సెలవులు ప్రకటించాయి. మరికొన్ని సంస్థలు తమ ఉద్యోగులకు జైలర్ టికెట్లు ఫ్రీగా ఇవ్వాలనే నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కొన్ని సినిమాలు నిరాశపరిచినప్పటికీ రజినీకాంత్‌కు ఉన్న క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదనే విషయం దీన్ని బట్టే తెలుస్తోంది.
