Site icon 10TV Telugu

Sai Pallavi : వీడెవడ్రా బాబు.. సాయి పల్లవి తండేల్ లో ఇతని డ్యాన్స్ కాపీ కొట్టిందట.. బెంగుళూరు నుంచి వచ్చి న్యాయం కావాలని..

Benguluru Telugu Man Claimed Sai Pallavi Thandel Steps are Mine and Want Justice

Benguluru Telugu Man Claimed Sai Pallavi Thandel Steps are Mine and Want Justice

Sai Pallavi : సాధారణంగా సినీ పరిశ్రమలో టైటిల్ లేదా స్టోరీ కాపీ కొట్టారని అప్పుడప్పుడు వార్తలు వింటూ ఉంటాము. స్టార్ హీరోల సినిమాలకు కూడా అప్పుడప్పుడు ఈ కాపీ రైట్ ఇబ్బందులు ఎదురవుతాయి. కానీ తాజాగా ఇతనెవరో సాయి పల్లవి తండేల్ సినిమాలో నా డ్యాన్స్ స్టెప్పులు కాపీ కొట్టింది అంటూ హడావిడి చేస్తున్నాడు.

నాగచైతన్య, సాయి పల్లవి జంటగా తెరకెక్కిన తండేల్ సినిమా ఇటీవల ఫిబ్రవరి 7న రిలీజయి మంచి విజయం సాధించింది. 100 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు కలెక్ట్ చేసి నాగ చైతన్య కెరీర్ లోనే బిగ్గెస్ట్ సినిమాగా నిలిచింది. సాయి పల్లవి మంచి డ్యాన్సర్ అని అందరికి తెలిసిందే. ఈ సినిమాలో హైలెస్సో హైలెస్సో.. సాంగ్ లో సాయి పల్లవి వేసిన స్టెప్స్ బాగా వైరల్ అయ్యాయి. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీలో సాయి పల్లవి డ్యాన్స్ అదరగొట్టింది. ఈ సాంగ్ లో సాయి పల్లవి వేసిన స్టెప్స్ సోషల్ మీడియాలో, బయట బాగా వైరల్ అయ్యాయి. అందరూ ఈ సాంగ్ కి అవే స్టెప్స్ వేస్తున్నారు.

Also Read : Mazaka Trailer : సందీప్ కిషన్ ‘మజాకా’ ట్రైలర్ వచ్చేసింది.. బాలయ్య బాబు ప్రసాదం కళ్ళకద్దుకొని తాగాలి.. తండ్రి కొడుకులు నవ్వించడానికి రెడీ..

అయితే తాజాగా బెంగుళూరులో ఉండే రమేష్ అనే తెలుగు వ్యక్తి సాయి పల్లవి నా స్టెప్స్ ని కాపీ కొట్టింది అంటూ సోషల్ మీడియాలో, పలు యూట్యూబ్ ఛానల్స్ లో హడావిడి చేస్తున్నాడు. రమేష్ తన ఇన్ స్టాగ్రామ్ లో సరదాగా రీల్స్ చేస్తూ ఉంటాడు. ఆ రీల్ చూస్తే ఏదో టైం పాస్ కి చేసినట్టు ఉంటాయి కానీ ప్రాక్టీస్ చేసి, కొత్త స్టెప్స్ నేర్చుకొని చేసినట్టు ఉండవు. ఇదివరకే ఇతని రీల్స్ మీద చాలా ట్రోల్స్ వచ్చాయి. ఇప్పుడు రమేష్.. నేను రెండేళ్ల క్రితమే ఆ స్టెప్స్ తో రీల్ చేశాను. అవి నా సోషల్ మీడియాలో ఉన్నాయి. సాయి పల్లవి నా స్టెప్స్ ని కాపీ చేసింది. నాకు న్యాయం చేయాలి అని అంటున్నాడు.

దీంతో ఇతని స్టెప్స్, ఇతని కామెంట్స్ వైరల్ గా మారడంతో సాయి పల్లవి ఫ్యాన్స్, నెటిజన్లు ఓ రేంజ్ లో రమేష్ ని ట్రోల్ చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు. అసలు నువ్వేసిన స్టెప్స్ కి, సాయి పల్లవి స్టెప్స్ కి ఏమన్నా సంబంధం ఉందా, నువ్వు కామెడీగా చేసేదానికి, ఆమె ప్రొఫెషనల్ డ్యాన్స్ తో కంపేర్ చేస్తావా? అవే స్టెప్స్ చాలా సినిమాల్లో ఉన్నాయి, అయినా స్టెప్స్ శేఖర్ మాస్టర్ వేయిస్తే సాయి పల్లవిని అంటావు ఏంటి అని ఫ్యాన్స్, నెటిజన్లు ఇతన్ని ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు.

Also Read : Vishwambhara : వామ్మో.. చిరంజీవి ‘విశ్వంభర’ హిందీ రైట్స్ అన్ని కోట్లకు అమ్ముడుపోయాయా?

Exit mobile version