ఒకొక్కడికి రిటర్న్ గిఫ్ట్ ఇస్తా – ‘భాగ్యనగర వీధుల్లో గమ్మత్తు’ ట్రైలర్
మెగాప్రిన్స్ వరుణ్ తేజ్ చేతుల మీదుగా శ్రీనివాస రెడ్డి దర్శకత్వం వహించిన కామెడీ ఎంటర్‌టైనర్ ‘‘భాగ్యనగర వీధుల్లో గమ్మత్తు’’ థియేట్రికల్ ట్రైలర్ విడుదల..

మెగాప్రిన్స్ వరుణ్ తేజ్ చేతుల మీదుగా శ్రీనివాస రెడ్డి దర్శకత్వం వహించిన కామెడీ ఎంటర్‌టైనర్ ‘‘భాగ్యనగర వీధుల్లో గమ్మత్తు’’ థియేట్రికల్ ట్రైలర్ విడుదల..
పాపులర్ కమెడియన్ కమ్ హీరో శ్రీనివాస రెడ్డి నిర్మాతగా, దర్శకుడిగా మారి ‘‘భాగ్యనగర వీధుల్లో గమ్మత్తు’’.. (మంచి రసగుల్లా లాంటి సినిమా) సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఆకృతి – ఆశృతి సమర్పణలో.. ఏ ఫ్లైయింగ్ కలర్స్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రొడక్షన్ బ్యానర్‌పై.. శ్రీనివాస రెడ్డి ప్రధాన పాత్రలో నటిస్తూ, నిర్మించిన ‘భాగ్యనగర వీధుల్లో గమ్మత్తు’ థియేట్రికల్ ట్రైలర్ మెగాప్రిన్స్ వరుణ్ తేజ్ రిలీజ్ చేశారు.
కామెడీ ప్రధానంగా రూపొందుతున్న ఈ సినిమా ట్రైలర్ ఆసక్తికరంగా ఉంది. సత్య, షకలక శంకర్ కీలక పాత్రల్లో నటించగా, వెన్నెల కిశోర్, చిత్రం శ్రీను, రఘబాబు, సత్యం రాజేష్, సుమన్ శెట్టి ఇతర పాత్రల్లో కనిపించనున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క జరుగుతోంది..
Read Also : నా కథకి మొదలు లేఖ – ‘తూటా’ ట్రైలర్
డిసెంబర్ 6న ‘‘భాగ్యనగర వీధుల్లో గమ్మత్తు’’ రిలీజ్ కానుంది. సినిమాటోగ్రఫీ : భరణి కె ధరన్, ఎడిటింగ్ : ఆవుల వెంకటేష్, మ్యూజిక్ : సాకేత్ కోమండూరి, ఆర్ట్ : రఘు కులకర్ణి, లైన్ ప్రొడ్యూసర్ : చిత్రం శ్రీను, నిర్మాత, దర్శకత్వం : వై.శ్రీనివాస రెడ్డి.