Bhagyashri Borse dance : ర‌వితేజ చూస్తుండ‌గానే.. స్టేజీపై కొరియోగ్రాఫ‌ర్‌తో రెచ్చిపోయిన హీరోయిన్‌..

మాస్ మహారాజ్ రవితేజ న‌టిస్తున్న మూవీ మిస్టర్‌ బచ్చన్‌.

Bhagyashri Borse dance : ర‌వితేజ చూస్తుండ‌గానే.. స్టేజీపై కొరియోగ్రాఫ‌ర్‌తో రెచ్చిపోయిన హీరోయిన్‌..

Bhagyashri Borse dance in Mr Bachchan Pre Release event

Updated On : August 13, 2024 / 9:15 AM IST

Bhagyashri Borse : మాస్ మహారాజ్ రవితేజ న‌టిస్తున్న మూవీ మిస్టర్‌ బచ్చన్‌. హ‌రీష్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న ఈ మూవీలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఆగ‌స్టు 15న ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ నేప‌థ్యంలో చిత్ర బృందం ప్ర‌మోష‌న‌ల్ కార్య‌క్ర‌మాల్లో వేగం పెంచింది. అందులో భాగంగా సోమ‌వారం రాత్రి(ఆగ‌స్టు 12న‌) క‌ర్నూల్‌లో ప్రీరిలీజ్ ఈ వేడుక‌ను ఎంతో ఘ‌నంగా నిర్వ‌హించారు.

ఈ వేడుక‌లో హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే ప్ర‌త్యేక ఆకర్ష‌ణ‌గా నిలిచింది. ప‌సురు రంగు చీరలో ఎంతో సంప్ర‌దాయ బ‌ద్ధంగా క‌నిపించింది. ఇక స్టేజీ పై కొరియోగ్రాఫ‌ర్ భానుతో క‌లిసి ఆమె డ్యాన్స్ చేసింది. భాగ్యశ్రీ బోర్సే డ్యాన్స్ చూసిన యాంక‌ర్ సుమ ఉత్సాహంతో ఆమె కూడా డ్యాన్స్ చేసింది. ‘నల్లంచు తెల్లచీర’ పాట‌లోని హుక్ స్టెప్‌కు డ్యాన్స్‌  వేశారు. దీంతో ఆ ప్రాంగ‌ణం మొత్తం అరుపుల‌తో దద్ద‌రిల్లిపోయింది.

Raviteja : సాయంత్రం 6 వ‌ర‌కు ఒక‌లా.. ఆ త‌రువాత మ‌రోలా.. హ‌రీష్ శంక‌ర్ పై ర‌వితేజ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు

ఈ చిత్రానికి మిక్కీజేయ‌ర్ మేయ‌ర్ సంగీతాన్ని అందిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ప‌తాకంపై టి.జి విశ్వ‌ప్ర‌సాద్ ఈ మూవీని నిర్మిస్తున్నారు. జ‌గ‌ప‌తిబాబు కీల‌క పాత్ర‌లో న‌టించారు.