Bhagyashri Borse
Animal Fame Tripti Dimri : మాస్ మహారాజా రవితేజ హీరోగా హరీశ్ శంకర్ దర్శకత్వంలో ఓ కొత్త సినిమా తెరకెక్కనుంది. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో షాక్, మిరపకాయ్ సినిమాలు వచ్చాయి. దీంతో కొత్త సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత టిజి విశ్వ ప్రసాద్ ఈ మూవీని నిర్మించనున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి ఓ అప్‌డేట్ వచ్చింది. ఈ సినిమాలో మాస్ మహారాజా రవితేజ పక్కన ఎవరు నటించనున్నారు అనే విషయం తెలిసిపోయింది.
`యారియాన్ 2 ఫేమ్ `భాగ్యశ్రీ బోర్సే’ ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటించనుంది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా చిత్ర బృందం తెలియజేసింది. మాస్ మహారాజా కా క్లాస్ మహారాణి అంటూ చిత్రబృందం హీరోయిన్ ఫోటోను పంచుకుంది. ఇంకా ఈ చిత్రంలో ఎవరెవరు నటించనున్నారు అనే విషయాలు మాత్రం వెల్లడించలేదు. త్వరలోనే మిగతా ఆరిస్టుల వివరాలను వెల్లడించే అవకాశం ఉంది.
Suma Kanakala : ఆ షో కోసం యాంకర్ కట్టుకున్న చీరలు ఎన్నో తెలిస్తే షాకవుతారు
Introducing the Class Maharani of Mass Maharaja @RaviTeja_offl & @harish2you‘s #MassReunion ❤?
The gorgeous #BhagyashriBorse is all set to add her alluring beauty to Mass Maharaja’s trademark energy ❤️?@vishwaprasadtg @vivekkuchibotla @peoplemediafcy pic.twitter.com/GROEAQHT6S
— People Media Factory (@peoplemediafcy) December 16, 2023
కాగా.. ఇంకా ఈ చిత్రానికి టైటిల్‌ను ఖరారు చేయలేదు. హిందీలో విజయవంతమైన ‘రైడ్’కి చిత్రానికి రీమేక్‌గా ఈ సినిమా తెరకెక్కనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. వచ్చే ఏడాది ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.
కళ్యాణ్ రామ్ ‘డెవిల్’ నుంచి కొత్త సాంగ్ ప్రోమో రిలీజ్.. దూరమే తీరమై..