Suma Kanakala : ఆ షో కోసం యాంకర్ కట్టుకున్న చీరలు ఎన్నో తెలిస్తే షాకవుతారు

టీవీ యాంకర్లు రకరకాల డ్రెస్సులు వేసుకుంటూ ఉంటారు. అయితే ఓ యాంకర్ షో కోసం వేల సంఖ్యలో చీరలు కట్టారు. ఆ నంబర్ తెలిస్తే ఆశ్చర్యపోతారు. నిజానికి ఇది కూడా ఓ రికార్డు కావచ్చేమో?

Suma Kanakala : ఆ షో కోసం యాంకర్ కట్టుకున్న చీరలు ఎన్నో తెలిస్తే షాకవుతారు

Suma Kanakala

Updated On : December 17, 2023 / 1:22 PM IST

Suma Kanakala : యాంకర్ సుమ ఎంత పాపులర్ అన్నది తెలిసిందే. చిరునవ్వుతో, సమయస్ఫూర్తితో ఏ కార్యక్రమాన్ని అయినా విజయవంతం చేయడంలో సుమ అందె వేసిన చేయి. రెండు దశాబ్దాలుగా నిర్విరామంగా దూసుకుపోతున్న సుమ ఇటీవల ఓ చిట్ చాట్‌లో ఓ షో కోసం తను కట్టుకున్న చీరల నంబర్ చెప్పగానే అందరూ ఆశ్చర్యపోయారు.

Manchu Lakshmi : మంచులో బికినీలో మంచులక్ష్మి స్నానం.. వైరల్ అవుతున్న వీడియో..

సినిమా ఈవెంట్లు, టీవీ కార్యక్రమాలతో యాంకర్ సుమ ఫుల్ బిజీగా ఉన్నారు. ఎంతోమంది యాంకర్లు వచ్చి వెళ్లిపోయినా సుమని ఎవరూ బీట్ చేయలేకపోయారని చెప్పాలి. సుమ కారణంగా ఎన్నో షోలు సక్సెస్‌ఫుల్‌గా ఏళ్ల తరబడి టెలికాస్ట్ అయ్యాయి. తను చేసిన షోలో ‘స్టార్ మహిళ’ గురించి ప్రత్యేకంగా చెప్పాలి. ఇటీవల సుమ ఈ షోకి సంబంధించి ఓ ఆసక్తికరమైన విషయం సుమ షేర్ చేసుకున్నారు.  5000 ఎపిసోడ్స్ ప్రసారమైన ఈ షోలో తాను 5000 చీరలు కట్టుకున్నానని చెప్పి అందర్నీ ఆశ్చర్యపరిచారు. ఆ షోతో పాటు మిగిలిన షోలకి 1500 చొప్పున వేసుకున్నా మొత్తంగా  తాను 6,500 చీరలు కట్టుకున్నట్లు చెప్పారామె. అయితే వాటిని తన  ఒంటిపై మాత్రమే పెట్టుకున్నానని ఇంటిలోకి రాలేదని నవ్వుతూ చెప్పారు సుమ. తను ఫస్ట్ శారీ గిఫ్ట్ 10వ తరగతిలో ఉన్నప్పుడు అందుకున్నానని తన తల్లి కొనిచ్చారని సుమ గుర్తు చేసుకున్నారు.

Anchor Suma : స్టేజీపై సుమ డాన్స్ అదుర్స్.. వీడియో చూశారా..?

సుమ మరో ఇంట్రెస్టింగ్ విషయాన్ని కూడా చెప్పారు. వెండితెరపై మీకు ఎవరితో నటించాలని ఉంది అన్న ప్రశ్నకు త్వరలోనే తన కొడుకుతో కనిపిస్తానని చెప్పారు. సుమ మాటలు వింటుంటే వీరిద్దరూ త్వరలోనే సిల్వర్ స్క్రీన్ పై కనిపించినా ఆశ్చర్యం లేదు. సుమ-రాజీవ్‌ల కొడుకు రోషన్ ఆల్రెడీ ‘బబుబల్ గమ్’ సినిమాతో ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా డిసెంబర్ 29 న థియేటర్లలోకి వస్తోంది.