Anchor Suma : స్టేజీపై సుమ డాన్స్ అదుర్స్.. వీడియో చూశారా..?

తాజాగా జరిగిన ఒక మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సుమ యాంకరింగ్ తో పాటు డాంసింగ్ కూడా చేసి అదరహో అనిపించారు.

Anchor Suma : స్టేజీపై సుమ డాన్స్ అదుర్స్.. వీడియో చూశారా..?

Anchor Suma dance video at Spark movie pre release event

Updated On : November 15, 2023 / 6:40 PM IST

Anchor Suma : యాంకర్ సుమ గురించి తెలుగు ఆడియన్స్ కి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రతి రోజు ఏదో విధంగా ఆమెను చూస్తూనే ఉంటారు. టీవీ షోలని, మూవీ ఈవెంట్స్ అని ఆమె అందర్నీ పలకరిస్తూనే ఉంటారు. ఇక తాజాగా జరిగిన ఒక మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఆమె యాంకరింగ్ తో పాటు డాంసింగ్ కూడా చేసి అదరహో అనిపించారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

టాలీవుడ్ లో త్వరలో రిలీజ్ కి సిద్దమవుతున్న ‘స్పార్క్ ది లైఫ్’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ రీసెంట్ గా జరిగింది. ఈ మూవీలో నటిస్తున్న మెహ్రీన్ పిర్జాదా, రుక్సార్ ధిల్లాన్.. ఈ ఈవెంట్ కి హాజరయ్యి సందడి చేశారు. ఇక వేదిక పై సినిమా పాటకు రుక్సార్ డాన్స్ వేస్తుంటే.. ఆమెతో పాటు సుమ కూడా డాన్స్ చేసి వావ్ అనిపించారు. స్టేజీ పై అందమైన హీరోయిన్ డాన్స్ వేస్తున్నా.. అందరూ సుమనే చూశారు. ఎందుకంటే ఆమె అంత బాగా డాన్స్ చేశారు. మరి ఆ డాన్స్ వీడియోని మీరుకూడా చూసేయండి.

Also read : Vishwak Sen : ‘గ్యాంగ్స్ అఫ్ గోదావరి’ సినిమా సెట్స్‌లో విశ్వక్ సేన్‌కి ప్రమాదం..

ఇక ఇన్నాళ్లు ఇతర హీరోల మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కి హోస్ట్ గా చేసిన సుమ.. త్వరలో తన తనయుడు రోషన్ నటిస్తున్న సినిమా ఈవెంట్ కి హోస్టుగా చేయడానికి సిద్ధమవుతున్నారు. ఆల్రెడీ చైల్డ్ ఆర్టిస్ట్ గా ఆడియన్స్ కి పరిచయమైన రోషన్.. ఇప్పుడు ‘బబుల్ గమ్’ సినిమాతో హీరోగా పరిచయం కాబోతున్నారు. రవికాంత్ పేరెపు డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ న్యూ ఏజ్ లవ్ స్టోరీతో తెరకెక్కుతుంది. డిసెంబర్ 29న న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ లో భాగంగా ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు సిద్దమవుతున్న ఈ సినిమా నుంచి టీజర్ అండ్ సాంగ్స్ రిలీజ్ అవుతూ వస్తున్నాయి. సాంగ్స్ యూత్ ని ఆకట్టుకునేలా ఉన్నాయి.