Bharatanatyam : ఐదేళ్ల తరువాత వస్తున్న ‘దొరసాని’ డైరెక్టర్.. ‘భరతనాట్యం’తో ఓ కొత్త క్రైం యూనివర్స్..

ఐదేళ్ల తరువాత వస్తున్న 'దొరసాని' డైరెక్టర్ కెవిఆర్ మహేంద్ర. 'భరతనాట్యం'తో ఓ కొత్త క్రైం యూనివర్స్..

Bharatanatyam : ఐదేళ్ల తరువాత వస్తున్న ‘దొరసాని’ డైరెక్టర్.. ‘భరతనాట్యం’తో ఓ కొత్త క్రైం యూనివర్స్..

Bharatanatyam movie director KVR Mahendra special interview

Updated On : April 1, 2024 / 6:50 PM IST

Bharatanatyam : ఆనంద్ దేవరకొండ, శివాత్మిక రాజశేఖర్ ని హీరోహీరోయిన్స్ గా పరిచయం అవుతూ ఆడియన్స్ ముందుకు వచ్చిన సినిమా ‘దొరసాని’. కెవిఆర్ మహేంద్ర దర్శకత్వం వహించిన ఈ చిత్రం మంచి టాక్ నే సొంతం చేసుకుంది. ఇక ఆ సినిమా తరువాత మళ్ళీ మరో సినిమాని అనౌన్స్ చేయని దర్శకుడు మహేంద్ర.. ఐదేళ్ల తరువాత ‘భరతనాట్యం’ అనే ఫ్రెష్ సబ్జెక్టు తో రాబోతున్నారు.

సూర్య తేజ ఏలే, మీనాక్షి గోస్వామి హీరోహీరోయిన్స్ గా నటిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 5న విడుదల కానుంది. ఇక ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఇంటర్వ్యూలో పాల్గొన్న దర్శకుడు కెవిఆర్ మహేంద్ర.. దొరసాని తరువాత గ్యాప్ ఎందుకు వచ్చిందో చెప్పరు. ఆ మూవీ తరువాత ఓ ప్రముఖ హీరోతో ఓ క్రైమ్ డ్రామా అనుకున్నారట. ఆ టైంలోనే కరోనా రావడంతో అంతా వెనక్కి వెళ్లిపోయిందట. ఆ తరువాత భరతనాట్యం స్క్రిప్ట్ ని అనుకోని ముందుకు కదిలారట.

ఇక ఈ సినిమా స్టోరీ లైన్ గురించి మాట్లాడుతూ.. దర్శకుడు కావాలని కలలు కంటున్న ఓ సహాయ దర్శకుడు.. ఒక విచిత్రమైన పరిస్థితి వల్ల క్రైమ్ వరల్డ్ లోకి వెళ్తాడు. అక్కడి నుంచి ఎలా బయట పడ్డాడు అనేది కథ. క్రైమ్ కామెడీతో తెరకెక్కిన ఈ చిత్రం డార్క్ కామెడీతో హిలేరియస్ గా నవ్విస్తుందని చెప్పుకొచ్చారు. సినిమాలోని ప్రతి పాత్ర బిన్నంగా ఉంటుంది. అది ఆడియన్స్ కి బాగా రిజిస్టర్ అవుతాయని చెప్పుకొచ్చారు.

Also read : Adivi Sesh – Akira Nandan : అడివి శేష్, అకిరా ఇంత క్లోజ్ ఫ్రెండ్సా.. అకిరా కోసం పవన్‌కి నో..

కాగా ఈ సినిమాలో హీరోగా నటిస్తున్న సూర్య తేజ ఏలే ఈ మూవీకి కథని అందిస్తున్నారు. అయితే సినిమా స్టార్టింగ్ లో సూర్యని హీరోగా అనుకోలేదట. స్క్రీన్ ప్లే రాసుకుంటున్నప్పుడు దర్శకుడు.. సూర్య తేజనే హీరోగా చూపించాలని నిర్ణయం తీసుకున్నారట. ఇక మ్యూజిక్ డైరెక్టర్ వివేక్ సాగర్ ఈ సినిమాకి చాలా సపోర్ట్ చేశారట. నేపథ్య సంగీతం అయితే నెక్స్ట్ లెవల్ లో ఉంటుందని పేర్కొన్నారు.

ఈ సినిమా విషయం ఇలా ఉంటే.. మరో మూడు క్రైమ్ డ్రామాలు తరహా కథలు కూడా ఉన్నాయట. వాటితో ఓ కొత్త యూనివర్స్ ని క్రియేట్ చేయాలనే ఆలోచన చేస్తున్నారట దర్శకుడు.