Bharatanatyam : తెలుగు ఇండస్ట్రీలోకి మరో కొత్త మహిళా నిర్మాత.. ఛాన్స్ వస్తే హీరోయిన్ అవుతా..
తెలుగు ఇండస్ట్రీలోకి మరో కొత్త మహిళా నిర్మాత. ఛాన్స్ వస్తే హీరోయిన్ కూడా అవుతా అంటున్న 'భరతనాట్యం' ప్రొడ్యూసర్ పాయల్ సరాఫ్.

Bharatanatyam movie producer Payal Saraf shares her first movie experience
Bharatanatyam : ‘దొరసాని’ సినిమా డైరెక్ట్ చేసిన కెవిఆర్ మహేంద్ర దర్శకత్వంలో రూపొందుతున్న క్రైమ్ కామెడీ చిత్రం ‘భరతనాట్యం’. సూర్య తేజ ఏలే ఈ సినిమాకి కథని అందిస్తూ హీరోగా నటిస్తున్నారు. లేడీ నిర్మాత పాయల్ సరాఫ్ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమాలో మీనాక్షి గోస్వామి హీరోయిన్ గా నటిస్తున్నారు. ఏప్రిల్ 5న ఈ సినిమా విడుదల అవుతుండడంతో.. మేకర్స్ ప్రమోషన్స్ లో సందడి చేస్తున్నారు. ఈక్రమంలోనే నిర్మాత పాయల్ సరాఫ్ తాజాగా ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు.
ఇక ఈ ఇంటర్వ్యూలో పాయల్ సరాఫ్ మాట్లాడుతూ.. ‘గ్లామర్ ఇండస్ట్రీలో ఏదైనా చేయాలని ఒక ఆసక్తి ఉండేది. కానీ నిర్మాతగా ఇండస్ట్రీకి వస్తానని అనుకోలేదు. అయితే ‘భరతనాట్యం’ వంటి మంచి కథ వినడంతో నిర్మాతగా ప్రొడ్యూస్ చేయాలని అనిపించింది’ అంటూ చెప్పుకొచ్చారు. ఈ కథ తన భర్త వల్ల తన దగ్గరికి వచ్చినట్లు పాయల్ చెప్పుకొచ్చారు. సూర్య తేజ ఏలే, పాయల్ భర్త జిమ్‌మేట్స్ అంట.
ఈ సినిమాతో తాను ఇండస్ట్రీ గురించి చాలా నేర్చుకున్నట్లు పాయల్ చెప్పుకొచ్చారు. ఒకప్పుడు పోస్టుప్రొడక్షన్ గురించి, షూటింగ్ సమయంలో ఎదురయ్యే సవాళ్లు గురించి ఏమి తెలియదని, కానీ ఇప్పుడు సినిమా మేకింగ్ అంటే ఏంటో ఒక అంచనా వచ్చినట్లు వెల్లడించారు. అలాగే కొత్త నిర్మాతకు చాలా సవాళ్లు ఎదురవుతూ ఉంటాయి. వాటిలో తనకి సూర్య, కెవిఆర్ మహేంద్ర తోడుగా నిలిచారని చెప్పుకొచ్చారు. ఈ సినిమా కోసం దర్శకుడు కెవిఆర్ మహేంద్ర వందశాతం ఎఫెర్ట్ పెట్టారని, ఆయనే వలనే సినిమా ఇండస్ట్రీ గురించి చాలా తెలిసిందని పేర్కొన్నారు.
Also read : Visweswara Rao : సినిమా ఇండస్ట్రీలో మరో విషాదం.. కమెడియన్ విశ్వేశ్వర రావు మరణం..
అందరి సహకారం వలన తొలి నిర్మాణంలో కూడా ఎటువంటి ఎక్స్‌ట్రా ఖర్చులు అవ్వకుండా, అనుకున్న బడ్జెట్ లో షూటింగ్ మొత్తం పూర్తీ అయ్యినట్లు చెప్పుకొచ్చారు. ఇక నార్త్ అమ్మాయి అయిన పాయల్ సరాఫ్.. నటిగా కూడా అవకాశాలు వస్తే చేస్తాను అంటున్నారు. అందుకు తన ఇంటిలోని వారి నుంచి కూడా సహకారం ఉందని పేర్కొన్నారు.
ఇక ఈ సినిమా స్టోరీ లైన్ గురించి మాట్లాడుతూ.. పెద్ద దర్శకుడు అవ్వాలని కలలుగనే ఓ సహాయ దర్శకుడు.. ఒక విచిత్రమైన పరిస్థితి వల్ల క్రైమ్ వరల్డ్ లోకి వెళ్తాడు. అక్కడి నుంచి ఎలా బయట పడ్డాడు అనేది కథ. క్రైమ్ కామెడీతో తెరకెక్కిన ఈ చిత్రం డార్క్ కామెడీతో హిలేరియస్ గా నవ్విస్తుందని చెప్పుకొచ్చారు. సినిమాలోని ప్రతి పాత్ర బిన్నంగా ఉంటుంది. ఇక ఈ సినిమాకి వివేక్ సాగర్ తన మ్యూజిక్ తో ప్రాణం పోశారని చెప్పుకొచ్చారు.