Bheemla Nayak: గుడ్ న్యూస్.. ఒకరోజు ముందే ‘ఆహా’లో భీమ్లా నాయక్!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా.. రానా దగ్గుబాటి నెగటివ్ రోల్ లో నటించిన లేటెస్ట్ మూవీ భీమ్లా నాయక్ అభిమానులకు గుడ్‏న్యూస్ అందించింది ఆహా ఓటీటీ. ఈ సినిమాను అచ్చ తెలుగు ఓటీటీ..

Bheemla Nayak: గుడ్ న్యూస్.. ఒకరోజు ముందే ‘ఆహా’లో భీమ్లా నాయక్!

Bheemla Nayak

Updated On : March 22, 2022 / 8:22 PM IST

Bheemla Nayak: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా.. రానా దగ్గుబాటి నెగటివ్ రోల్ లో నటించిన లేటెస్ట్ మూవీ భీమ్లా నాయక్ అభిమానులకు గుడ్‏న్యూస్ అందించింది ఆహా ఓటీటీ. ఈ సినిమాను అచ్చ తెలుగు ఓటీటీ ఆహాలో మార్చి 25న స్ట్రీమింగ్ చేయనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఒక్కరోజు ముందుగానే అంటే మార్చి 24న ఆహాలో భీమ్లా నాయక్ రచ్చ చేయనున్నట్లు ప్రకటించారు. ఆహా ఓటీటీ ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా అధికారికంగా ప్రకటించింది.

Bheemla Nayak Bike: ‘ఆహా’ బంపర్ ఆఫర్.. పవన్ బైక్ సొంతం చేసుకొనే ఛాన్స్!

భీమ్లా నాయక్’. ఈ చిత్రానికి సాగర్ కె చంద్ర దర్శకత్వం వహించగా.. త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు, కథనం అందించారు. ఈ సినిమా భారీ అంచనాల నడుమ ఫిబ్రవరి 25న ప్రపంచవ్యాప్తంగా విడుదలై బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. రూ.100 కోట్ల షేర్ రాబట్టిన ఈ సినిమాలోని మాస్ డైలాగ్స్, యాక్షన్ సన్నివేశాలు ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించాయి. పవన్ కి పోటాపోటీగా రానా నటన విమర్శకుల ప్రశంశలు దక్కించుకుంది. అయితే.. థియేటర్లలో రిలీజ్ కోసం ఎంతగా ఎదురుచూశారో ఇప్పుడు ఓటీటీలో రిలీజ్ కోసం పవన్ ఫ్యాన్స్ అంతే ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Bheemla Nayak: RRR రిలీజ్ రోజున పవన్ డబుల్ ధమాకా!

అభిమానుల ఆసక్తిని గమనించిన ఆహా ఒకరోజు ముందే భీమ్లా నాయక్ ను స్టీమింగ్ కు తీసుకొస్తున్నట్లు గుడ్ న్యూస్ చెప్పింది. ఎప్పటికప్పుడు ప్రేక్షకుల పల్స్ పట్టుకొని, ఆసక్తిని గమనించి సినిమాలను, వెబ్ సిరీస్లను, షోలను తీసుకొచ్చే ఆహా.. మార్చి 25న భారీ క్రేజీ మల్టీస్టారర్ ఆర్ఆర్ఆర్ రిలీజ్ ఉండడంతో ఒకరోజు ముందే భీమ్లాను స్ట్రీమింగ్ తీసుకొచ్చినట్లు కనిపిస్తుంది. మరోవైపు ఆహా భీమ్లా నాయక్ స్టీమింగ్ మొదలైన తర్వాత కొత్తగా సబ్ స్క్రైబ్ చేసుకున్న వాళ్ళలో లాటరీ ద్వారా ఒకరికి సినిమాలో పవన్ కళ్యాణ్ ఉపయోగించిన బైక్ అందించనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. సో ఇంకెందుకు ఫ్యాన్స్.. ఓటీటీలో ఇంకో రౌండ్ వేసేయండి మరి!