Bheemla Nayak: RRR రిలీజ్ రోజున పవన్ డబుల్ ధమాకా!

మార్చి 25... ఈ రోజు కోసం తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ఎంతో కాలంగా అందరూ ఆతృతగా ఎదురుచూస్తున్న టాలీవుడ్ బిగ్గెస్ట్ మల్టీస్టారర్ మూవీ ‘RRR’.....

Bheemla Nayak: RRR రిలీజ్ రోజున పవన్ డబుల్ ధమాకా!

Pawan Kalyan Bheemla Nayak Ott Streaming On March 25

Bheemla Nayak: మార్చి 25… ఈ రోజు కోసం తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ఎంతో కాలంగా అందరూ ఆతృతగా ఎదురుచూస్తున్న టాలీవుడ్ బిగ్గెస్ట్ మల్టీస్టారర్ మూవీ ‘RRR’ యావత్ ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్ అవుతుండటంతో ఈ సినిమాను చూసేందుకు ఆడియెన్స్ సిద్ధమవుతున్నారు. ఇక ఈ చిత్రాన్ని తొలిరోజే చూడాలని చాలా మంది ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఆర్ఆర్ఆర్ రిలీజ్ రోజున ఎవరూ ఊహించని విధంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓ అదిరిపోయే ట్రీట్ ఇవ్వనున్నాడు. RRR రిలీజ్ రోజున పవన్ ట్రీట్ ఏమిటా అని అనుకుంటున్నారా.. అయితే పవన్ ఇవ్వబోతున్న ట్రీట్ థియేటర్లలో కాదులెండీ!

Bheemla Nayak: ఓటీటీలో భీమ్లా.. రికార్డులు ఆహా అనాల్సిందే!

పవన్ కళ్యాణ్ నటించిన రీసెంట్ మూవీ భీమ్లా నాయక్ ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద సూపర్ సక్సెస్‌ను అందుకుంది. మలయాళ బ్లాక్‌బస్టర్ మూవీ ‘అయ్యప్పనుమ్ కొషియుమ్’కు తెలుగు రీమేక్‌గా వచ్చిన ఈ సినిమాను దర్శకుడు సాగర్ కె చంద్ర తెరకెక్కించగా, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఈ సినిమాకు స్క్రిప్ట్, మాటలు అందించడంతో ఈ సినిమాకు ప్రేక్షకుల నుండి బ్రహ్మాండమైన రెస్పాన్స్ లభించింది. ఇక పవర్ స్టార్‌ను చాలా రోజుల తరువాత ఈ స్థాయిలో ఎనర్జిటిక్‌గా చూడటంతో పవన్ అభిమానులు ఈ సినిమాను చూసేందుకు థియేటర్లు క్యూ కట్టారు. ఈ సినిమాలో మరో యంగ్ హీరో రానా దగ్గుబాటి కూడా నటించడం, పవన్‌ను ఢీకొట్టే వ్యక్తిగా ఆయన పర్ఫార్మెన్స్ కూడా ప్రేక్షకులను మెప్పించడంతో ఈ సినిమా సూపర్ సక్కెస్ అయ్యింది. ఇలా ఓవరాల్‌గా అన్ని అంశాలు కూడా భీమ్లా నాయక్ చిత్ర సక్సెస్‌కు దోహదపడటంతో ఈ చిత్రం పవన్ కళ్యాణ్ కెరీర్‌లో మరో బ్లాక్‌బస్టర్ మూవీగా నిలిచింది.

అయితే ఫిబ్రవరి 25న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్ అయిన భీమ్లా నాయక్ చిత్రాన్ని ఓటీటీలో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది. ఈ మూవీని మార్చి 25న ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం ‘ఆహా’లో రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ అనౌన్స్ చేసింది. అదే రోజున డిస్నీ హాట్‌స్టార్‌లోనూ ఈ సినిమా అందుబాటులోకి రానుంది. ఇలా ఈ సినిమాను ఒకే రోజున రెండు ఓటీటీ ప్లాట్‌ఫాంలలో రిలీజ్ చేయడంతో భీమ్లా నాయక్ చిత్రానికి మంచి వ్యూవర్‌షిప్ రావడం ఖాయమని చిత్ర యూనిట్ ఆశిస్తోంది. RRR లాంటి బిగ్గెస్ట్ మూవీ రిలీజ్ రోజునే భీమ్లా నాయక్ కూడా ఓటీటీలో రిలీజ్ అవుతుండటంతో పవన్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఆర్ఆర్ఆర్ టికెట్లు దొరక్కపోతే, పవన్ కళ్యాణ్ సినిమా చూస్తూ ఎంజాయ్ చేస్తామని వారు అంటున్నారు.

Bheemla Nayak : ‘రాధేశ్యామ్’ రాకతో ‘భీమ్లా నాయక్’కి దెబ్బ.. నష్టాల్లో డిస్ట్రిబ్యూటర్స్..

ఏదేమైనా RRR రిలీజ్ రోజును పవన్ కళ్యాణ్ సినిమా కూడా వస్తుండటంతో, ఆ రోజున సినిమా ప్రేక్షకులకు డబుల్ ట్రీట్ ఖాయమని అంటున్నారు సినీ ఎక్స్‌పర్ట్స్. టికెట్లు దొరికిన వారు RRR సినిమా చూస్తుంటే, టికెట్లు లేని వారు భీమ్లా నాయక్ చూసి ఎంజాయ్ చేయడం మాత్రం ఖాయమని సినీ ప్రేమికులు అంటున్నారు. ఇక భీమ్లా నాయక్ ఓటీటీలో ఎలాంటి రికార్డును క్రియేట్ చేస్తుందా అని పవన్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.