Bheemla Nayak: ఓటీటీలో భీమ్లా.. రికార్డులు ఆహా అనాల్సిందే!

థియేటర్స్ లో ఆహా అనిపిస్తోన్న పవర్ స్టార్.. త్వరలో ఆహా ఓటీటీ ఎంట్రీతో పూనకాలు తెప్పించబోతున్నారు. అవును 150 కోట్ల కలెక్షన్స్ ను వారంలోనే క్రాస్ చేసి దూసుకుపోతున్న భీమ్లానాయక్..

Bheemla Nayak: ఓటీటీలో భీమ్లా.. రికార్డులు ఆహా అనాల్సిందే!

Bheemla Nayak

Bheemla Nayak: థియేటర్స్ లో ఆహా అనిపిస్తోన్న పవర్ స్టార్.. త్వరలో ఆహా ఓటీటీ ఎంట్రీతో పూనకాలు తెప్పించబోతున్నారు. అవును 150 కోట్ల కలెక్షన్స్ ను వారంలోనే క్రాస్ చేసి దూసుకుపోతున్న భీమ్లానాయక్.. ఇప్పుడు ఆహాలో రికార్డులు క్రియేట్ చేసేందుకు సిద్దమవుతున్నాడు.

Bheemla Nayak: ‘భీమ్లానాయక్‌’ చేశాక హీరో అంటే ఏంటో తెలిసింది: రానా

ఆహా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు భీమ్లానాయక్. మార్చ్ ఎండింగ్ కల్లా పవన్ కొత్త సినిమా ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతుంది. ఇప్పటికే థియేటర్స్ లో రిలీజై ఫస్ట్ డే ట్రెమండస్ కలెక్షన్స్.. వారంలోనే 150 కోట్ల బాక్సాఫీస్ రికార్డ్ తో దూసుకుపోతుంది భీమ్లానాయక్ మూవీ. ఇక అతిత్వరలో ఆహా ఎంట్రీ ఇచ్చి.. ఫ్యాన్స్ ఇంటింటా లాలా.. భీమ్లా అంటూ రీసౌండ్ చేయబోతున్నారు పవర్ స్టార్.

Bheemla Nayak: యాక్షన్, ఇంటెన్స్ ఎమోషన్స్.. బొమ్మ చూపించేశాడు బాబోయ్!

వారానికో సినిమా కాన్సెప్ట్ తో సినిమాపురాన్ని సిద్ధం చేసింది ఆహా ఓటీటీ. కొత్త కొత్త సినిమాల స్ట్రీమింగ్ తో ఆడియెన్స్ ను ఎంగేజ్ చేస్తూనే ఉంది. ఇప్పుడేకంగా థియేటర్ రిలీజ్ కి పెద్ద గ్యాప్ లేకుండా భీమ్లానాయక్ ను ప్రెజెంట్ చేస్తూ ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది. థియేటర్ లో భీమ్లా పవర్ చూసిన ఫ్యాన్స్ తో పాటూ స్మార్ట్ స్క్రీన్ ఆడియెన్స్ సైతం ఆహాలో భీమ్లా రాక కోసం ఎప్పుడెప్పుడా అని ఇప్పుడు ఎదురుచూస్తున్నారు.