Pawan Kalyan : ఏపీలో పలుచోట్ల ‘భీమ్లా నాయక్’ సెకండ్ షో రద్దు.. దాని బదులు..

ఏపీ ప్రభుత్వం నాలుగు షోలు మాత్రమే వేయాలని ఆదేశాలు ఇవ్వటంతో పాటు మరోపక్క థియేటర్ల వద్ద పవన్ అభిమానులు నిరసనలు తెలియచేస్తుండటంతో చాలా థియేటర్లు కొత్త నిర్ణయాన్ని తీసుకున్నారు......

Pawan Kalyan : ఏపీలో పలుచోట్ల ‘భీమ్లా నాయక్’ సెకండ్ షో రద్దు.. దాని బదులు..

Bheemla Nayak

Updated On : February 25, 2022 / 9:24 AM IST

 

Bheemla Nayak :  ఇవాళ ప్రపంచ వ్యాప్తంగా ‘భీమ్లా నాయక్’ సినిమా రిలీజ్ అవుతుంది. ఒకపక్క తెలంగాణలో అయిదవ షో పర్మిషన్లు ఇచ్చారు. బెనిఫిట్ షోలు కూడా పడుతున్నాయి, టికెట్ రేట్లు పెంచుకునే అవకాశం కూడా కల్పించారు. అటు ఏపీలో మాత్రం పరిస్థితి ఏమి మారలేదు. ‘భీమ్లా నాయక్’ సినిమా రిలీజ్ ఉండటంతో థియేటర్లకు హెచ్చరికలు జారీ చేసింది ఏపీ ప్రభుత్వం. భీమ్లా నాయక్ సినిమా బెనిఫిట్ షోలు వేసినా, ఎక్స్ట్రా షోలు వేసినా, ప్రభుత్వం చెప్పిన రేట్ల కంటే ఎక్కువ వసూలు చేసినా కఠిన చర్యలు తప్పవు అంటూ థియేటర్లకు నోటీసులు జారీ చేశారు.

దీనిపై పవన్ అభిమానులు ఏపీలో పలుచోట్ల నిరసనలు తెలిపారు. పవన్ అభిమానులు ఇప్పటికే థియేటర్ల వద్ద పడిగాపులు కాస్తున్నారు. ఒకపక్క ఏపీ ప్రభుత్వం నాలుగు షోలు మాత్రమే వేయాలని ఆదేశాలు ఇవ్వటంతో పాటు మరోపక్క థియేటర్ల వద్ద పవన్ అభిమానులు నిరసనలు తెలియచేస్తుండటంతో చాలా థియేటర్లు కొత్త నిర్ణయాన్ని తీసుకున్నారు.

Bheemla Nayak : ఏపీలో డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్ యాజమాన్యాల కోసం పవన్ ఫ్యాన్స్ విరాళాల సేకరణ

ఉదయం 8.30 గంటలకు మొదటి షోని ప్రదర్శించారు. 11 గంటలకి ప్రారంభం అవ్వాల్సిన మొదటి షో ఉదయం 8.30 గంటలకే ప్రారంభమైంది. అయితే ఉదయమే షో వేయడంతో రాత్రి సెకండ్ షోని రద్దు చేశాయి. ఏపీలో చాలా థియేటర్లు ఇదే పద్దతిని ఫాలో అవుతున్నాయి. దీంతో ఇవాళ పలు చోట్ల భీమ్లా నాయక్ సెకండ్ షోలు రద్దయ్యాయి. చాలా థియేటర్స్ వద్ద పోలీసులని కూడా భారీగా మోహరించారు. ఇలాంటి పరిస్థితులని చూసి పవన్ అభిమానులు, సినీ ప్రేక్షకులు ఏపీ ప్రభుత్వంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు.