Bheemla Nayak : ఏపీలో డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్ యాజమాన్యాల కోసం పవన్ ఫ్యాన్స్ విరాళాల సేకరణ

అయిదవ షో పర్మిషన్లు ఇచ్చారు. బెనిఫిట్ షోలు కూడా పడుతున్నాయి, టికెట్ రేట్లు పెంచుకునే అవకాశం కూడా కల్పించారు. అటు ఏపీలో మాత్రం పరిస్థితి ఏమి మారలేదు. సినీ పెద్దలు ఎన్ని సార్లు......

Bheemla Nayak : ఏపీలో డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్ యాజమాన్యాల కోసం పవన్ ఫ్యాన్స్ విరాళాల సేకరణ

Bheemla

Pawan Kalyan :  ఇవాళ ప్రపంచ వ్యాప్తంగా భీమ్లా నాయక్ సినిమా రిలీజ్ అవుతుంది. ఒకపక్క తెలంగాణలో అయిదవ షో పర్మిషన్లు ఇచ్చారు. బెనిఫిట్ షోలు కూడా పడుతున్నాయి, టికెట్ రేట్లు పెంచుకునే అవకాశం కూడా కల్పించారు. అటు ఏపీలో మాత్రం పరిస్థితి ఏమి మారలేదు. సినీ పెద్దలు ఎన్ని సార్లు ఏపీ ప్రభుత్వంతో చర్చలు జరిపినా ఉపయోగం లేకపోయింది. మళ్ళీ పాత చింతకాయ పచ్చడి అన్నట్టే వ్యవహరిస్తోంది ఏపీ ప్రభుత్వం. మొన్నటిదాకా సైలెంట్ గా ఉన్న ఏపీ ప్రభుత్వం మళ్ళీ ‘భీమ్లా నాయక్’ సినిమాతో థియేటర్లకు హెచ్చరికలు జారీ చేసింది.

రెవెన్యూ డిపార్ట్మెంట్ తరపున ఏపీ థియేటర్లకు నోటీసులు జారీ చేశారు. భీమ్లా నాయక్ సినిమా బెనిఫిట్ షోలు వేసినా, ఎక్స్ట్రా షోలు వేసినా, ప్రభుత్వం చెప్పిన రేట్ల కంటే ఎక్కువ వసూలు చేసినా కఠిన చర్యలు తప్పవు అంటూ థియేటర్లకు నోటీసులు ఇచ్చారు. ఇవాళ MRO, VROలు కూడా థియేటర్లని తనిఖీ చేస్తారని కూడా తెలిపారు. ఇక టికెట్ రేట్లు 10, 15, 20, 25 అంటూ పెట్టారు. ఈ రేట్లతో సినిమా రిలీజ్ చేస్తే థియేటర్ మెయింటినైన్స్ కూడా రావు అని థియేటర్ యాజమాన్యాలు గోల పెట్టినా ఏపీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.

Bheemla Nayak : పవన్ అభిమానులపై లాఠీ ఛార్జ్..

దీంతో ఇవాళ ‘బీమ్లా నాయక్’ సినిమా రిలీజ్ సందర్భంగా పవన్ అభిమానులు కొన్ని థియేటర్ల వద్ద బ్యానర్లు పెట్టి విరాళాలు సేకరిస్తున్నారు. ”ఏపీ ప్రభుత్వం పెట్టిన రేట్లతో థియేటర్ యాజమాన్యాలు, డిస్ట్రిబ్యూటర్లు నష్టపోతారు. వారికి నష్టం కలగకుండా మీకు తోచినంత సహాయం చేయగలరని. అభిమానుల తరపున విరాళాలు సేకరిస్తున్నాం” అంటూ థియేటర్ల బయట బ్యానర్లతో పాటు హుండీలను ఏర్పాటు చేసారు పవన్ అభిమానులు. ఈ పని చేసినందుకు పవన్ ఫ్యాన్స్ ని అభిమానిస్తూ ఏపీ ప్రభుత్వంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు సినీ ప్రేక్షకులు.