బస్సులో ‘భీష్మ’ ప్రసారం – మంత్రి కేటీఆర్ ఆగ్రహం..

నితిన్ ‘భీష్మ’ చిత్రం పైరసీ.. మంత్రి కేటీఆర్ హామీ..

  • Published By: sekhar ,Published On : February 28, 2020 / 07:53 AM IST
బస్సులో ‘భీష్మ’ ప్రసారం – మంత్రి కేటీఆర్ ఆగ్రహం..

Updated On : February 28, 2020 / 7:53 AM IST

నితిన్ ‘భీష్మ’ చిత్రం పైరసీ.. మంత్రి కేటీఆర్ హామీ..

 

రూ.50 కోట్ల గ్రాస్ సాధించిన ‘భీష్మ’..
యంగ్ హీరో నితిన్ టైటిల్ రోల్ పోషించిన ‘భీష్మ’ చిత్రం మహా శివరాత్రి కానుకగా ఫిబ్రవరి 21న విడుదలై ఘన విజయం సాధించింది. నాయికగా నటించిన ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మించగా వెంకీ కుడుముల దర్శకత్వం వహించిన ‘భీష్మ’ విజయంతంగా 2వ వారంలోకి ప్రవేశించింది. ఇప్పటికే హైదరాబాద్‌లో సక్సెస్ మీట్ నిర్వహించిన టీమ్,  ఫిబ్రవరి 29న వైజాగ్‌లో థ్యాంక్స్ మీట్ ఏర్పాటు చేశారు. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరు కానున్నాడు. తాజాగా ‘భీష్మ’ రూ.50 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్టు అధికారింగా తెలిపారు నిర్మాతలు.

Bheeshma 50 CR

పంటకి తెగులు.. సినిమాకి పైరసీ..
ఇదిలా ఉంటే ఈ సినిమా పైరసీ బారిన పడింది. ఏకంగా TSRTC బస్సుల్లో ‘భీష్మ’ ప్రదర్శించడంతో నిర్మాతలు ఖంగుతిన్నారు. హైదరాబాద్ నుంచి వివిధ జిల్లాలకు నడిచే సూపర్ లగ్జరీ, రాజధాని బస్సుల్లో ‘భీష్మ’ సినిమాను ప్రసారం చేసినట్లుగా ఓ ప్రయాణికుడు గుర్తించాడు. ఖమ్మం వెళ్తున్న రాజధాని ఏసీ బస్సులో ఈ చిత్రాన్ని ప్రదర్శిస్తుండగా ఓ ప్రయాణికుడు తన ఫోన్‌లో చిత్రీకరించాడు. ఆ వీడియోను ‘భీష్మ’ చిత్ర టీమ్‌కు ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశాడు. 

స్పందించిన హీరో, దర్శకుడు.. సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు..
దీనిపై హీరో నితిన్ తక్షణం స్పందించి ఈ విషయాన్ని ఫిలిం ఛాంబర్‌లోని యాంటీ పైరసీ విభాగం దృష్టికి తెచ్చారు. ఆ విభాగం వారు వెంటనే గురువారం హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రిలీజ్ అయిన నాలుగో రోజే ఆర్టీసీ బస్సులో ‘భీష్మ’ సినిమాను ప్రదర్శించారని, ఇతర మాధ్యమాలు, సామాజిక మాధ్యమాల్లో విస్తరించకుండా చర్యలు చేపట్టాలని వారు పోలీసులను కోరారు. దీనిపై దర్శకుడు వెంకీ కుడుముల కూడా ఓ ట్వీట్ చేశారు. ‘‘ఆఖరికి పైరసీ సినిమాలు తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో ప్రసారమవుతున్నాయి. ఇది చాలా విచారకరం. మాకు ఏ సమస్య వచ్చినా ట్యాగ్ చేయాలనిపించే వ్యక్తి ఒకే ఒక్క ఐడీ కేటీఆర్ గారిది. అందుకే మీకు ట్యాగ్ చేస్తున్నా’’ అని ట్వీట్ చేశారు. 

కేటీఆర్ సీరియస్.. మంత్రికి ఆదేశాలు జారీ..
దర్శకుడు వెంకీ చేసిన ట్వీట్‌పై, కేటీఆర్ సీరియస్‌గా స్పందించారు. టీఎస్ఆర్టీసీ బస్సుల్లో పైరసీ చిత్రాలను ప్రదర్శించకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి కేటీఆర్ గురువారం ట్విట్టర్‌లో రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కు సూచించారు. పైరసీ అడ్డుకట్టకు చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు.