Bhola Shankar
Bhola Shankar teaser : మెగాస్టార్ చిరంజీవి( Chiranjeevi), తమన్నా(Tamannaah) జంటగా నటిస్తున్న చిత్రం భోళా శంకర్(Bhola Shankar ). మెహర్ రమేష్(Meher Ramesh) దర్శకత్వంలో తెరకెక్కతున్న ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్‌టైన్మెంట్స్ పతాకంపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. మహతి స్వరసాగర్ సంగీతాన్ని అందిస్తుండగా సుశాంత్, కీర్తి సురేష్ లు కీలక పాత్రలో నటిస్తున్నారు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో ఇప్పటికే చిత్ర బృందం ప్రమోషనల్ కార్యక్రమాలను మొదలుపెట్టింది. అందులో భాగంగా జూన్ 24న శనివారం సినిమా టీజన్‌ను విడుదల చేయనున్నట్లు తెలియజేశారు.
Bhola Shankar : మెగా టీజర్ కి డేట్ ఫిక్స్.. ఇక భోళాశంకరుడి జాతర షురూ..
రెండు తెలుగు రాష్ట్రాల్లో శనివారం సాయంత్రం 5.30 గంటలకు పలు థియేటర్లలో టీజర్‌ను విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. ఈ మేరకు ఓ పోస్టర్‌ను విడుదల చేసింది. ఇందులో చిరంజీవి చాలా స్ట్రైలిష్ లుక్‌లో ఉన్నారు. బ్లాక్ కలర్ జీన్స్, టీ షర్ట్‌పై చెక్ షర్ట్ ధరించి బ్లాక్ కళ్లద్దాలతో చాలా స్టైల్‌గా నడుస్తున్నట్లుగా ఉంది.
టీజర్ లాంచ్ థియేటర్ల లిస్ట్ ఇదే..
Bhola Shankar : చిరు లీక్స్ నుంచి మరో సాంగ్.. భోళా శంకరుడి సంగీత్ పార్టీ..
1.శ్రీకాకుళం-ఎస్‌వీసీ, 2.టెక్కలి-సుదర్శన్, 3)విజయనగరం-ఎన్‌సీఎస్ 4) బొబ్బిలి – సాయి గణపతి 5) వైజాగ్- జగదాంబ 6) రాజమండ్రి – శ్యామల 7) కాకినాడ- దేవి 8) అమలాపురం – వెంకట రామా 9) మండపేట -సప్తగిరి 10) రావుల పాలెం -పద్మ శ్రీ 11) ఏలూరు – సత్యనారాయణ 12) భీమవరం – పద్మాలయ, 13) తణుకు – వీరేశ్వర్ 14) తాడేపల్లిగూడెం – శ్రీశాన్ మహల్ 15) పాలకొల్లు – మారుతి 16) విజయవాడ – జయరాం 17) గుంటూరు – భాస్కర్ 18) ఒంగోలు – గోర్లంట మల్టీప్లెక్స్ 19) నెల్లూరు – ఎస్2 సినిమాస్ 20) తిరుపతి – ప్రతాప్ 21) చిత్తూరు – రాఘవ 22) అనంతపురం – వి మెగా స్క్రీన్ 1 23) ధర్మవరం- సిద్ధార్థ 24) సుళ్లూరుపేట – యూవీ 25) గుత్తి – అమృత 26) కడప – ఎస్ ఆర్ సినిమాస్ 27) రైల్వే కోడూరు – సిద్దేశ్వరా 28) ప్రొద్దుటూరు – చాంద్ 29) కర్నూల్ – రాజ్ 30) నంద్యాల – ప్రతాప్ 31) వరంగల్ – జెమినీ 32) ఖమ్మం – తిరుమల 33) కరీంనగర్ – మమత 34) హైదరాబాద్ – సంధ్య 70 ఎంఎం 35) బెంగళూరు – ఊర్వశీ 36) అనకాపల్లి – రామచంద్రా 37) ఆదోని – ద్వారకా 38) గుంతకల్లు – ఎస్ఎల్‌వీ థియేటర్ 39) యమ్మిగనూర్ – శివ ప్రియ 40) గాజువాక – మోహిని థియేటర్
Experience the Mega carnival with the Mighty #BholaaShankar Teaser Launch at your nearest theatres?
Here’s the AP & TS Theatres list for Tomorrow ?
Mega?@KChiruTweets @MeherRamesh @AnilSunkara1 @tamannaahspeaks @KeerthyOfficial @iamSushanthA @shreyasgroup… pic.twitter.com/yLQiv7h4Ry
— AK Entertainments (@AKentsOfficial) June 23, 2023
Keedaa Cola : ఈ నగరానికి ఏమైంది రీ రిలీజ్.. కీడా కోలా టీజర్.. అప్డేట్స్ ఇచ్చిన తరుణ్ భాస్కర్!