Kaushal Manda : ‘పీపుల్ స్టార్’ ఏంటి.. ఇదెప్పుడు పెట్టారు?.. కౌశల్‌కు కౌంటర్స్..
తన అభిమానుల కలలను నెరవేర్చడానికి ‘రైట్’ అనే సినిమాలో హీరోగా నటిస్తున్నట్లు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు కౌశల్ బాబు..

Big Boss Fame Kaushal Manda Turned As Hero
Kaushal Manda: ‘మెగాస్టార్’ నుండి ‘సుప్రీం హీరో’ సాయి ధరమ్ తేజ్ వరకు మన టాలీవుడ్ హీరోల పేర్లకు ముందున్న స్టార్ ట్యాగ్స్ అన్నీ ఆల్‌మోస్ట్ మనకి తెలిసినవే. అయితే ఇండస్ట్రీ వాళ్లకి తప్ప ‘పీపుల్స్ స్టార్’ అనే ట్యాగ్ ఏ హీరోకుందో పెద్దగా ఎవరికీ తెలియదు. ప్రజా సమస్యలపై సినిమాలు తీస్తూ.. తన సినిమాలతో ప్రజల్లో చైతన్యం కలిగించే నటుడు, నిర్మాత, దర్శకుడు ఆర్.నారాయణ మూర్తిని ‘పీపుల్స్ స్టార్’ అని పిలుస్తారు.
View this post on Instagram
ఇప్పుడు ఇదే ట్యాగ్ తనకు తానే పెట్టేసుకుని వార్తల్లో నిలిచాడు కౌశల్. చిన్న సినిమాలు, సీరియల్స్‌తో పాపులర్ అయిన కౌశల్.. బిగ్ బాస్ సెకండ్ సీజన్‌లో విన్ అయిన తర్వాత మరింత పాపులర్ అయ్యాడు. అతడు బిగ్ బాస్ హౌస్‌లో ఉండగానే ‘కౌశల్ ఆర్మీ’ కూడా తయారయ్యింది. కౌశల్ ప్రస్తుతం ఆది సాయి కుమార్ హీరోగా నటిస్తున్న ‘బ్లాక్’ మూవీలో పోలీస్ క్యారెక్టర్ చేస్తున్నాడు. దీని తర్వాత తన అభిమానుల కలలను నెరవేర్చడానికి ‘రైట్’ అనే సినిమాలో హీరోగా నటిస్తున్నట్లు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు కౌశల్ బాబు.
‘‘గత మూడు సంవత్సరాలుగా నన్ను అభిమానిస్తూ నన్ను ‘‘పీపుల్ స్టార్’’ గా పిలుచుకుంటూ ఆనందిస్తూ, అన్నా నిన్ను బిగ్ స్క్రీన్ మీద హీరోగా చూడాలను ఉంది. ఆ అవకాశం మాకు ఎప్పుడు వస్తుంది అంటూ ప్రతీ రోజు అడుగుతూ వారి కోరిక తీర్చటమే నా కలగా మార్చిన నా అభిమానులందరి కోసం ఈ రోజు మీ అందరి రోజు గా చేస్తూ నేను హీరోగా నటిస్తున్న ‘‘రైట్’’ మూవీ ముహూర్తం షాట్ మీతో పంచుకోవాలనిఅనుకుంటున్నా. ఎప్పటి లాగే మీ ప్రేమ, అభిమానం నా మీద, మా మూవీ యూనిట్ మొత్తం మీద చూపిస్తారని నాకు తెలుసు.. love you all’’.. అంటూ ‘రైట్’ సినిమా పోస్టర్ షేర్ చేశాడు. ఇక్కడి వరకు బాగానే ఉంది. కౌశల్ హీరో అవుతుంటే ఫ్యాన్స్ హ్యాపీగా ఫీలవడంలో అర్థముంది కానీ ‘పీపుల్ స్టార్’ ఏంటి.. ఇదెప్పుడు పెట్టారు? అంతేలే, ఈమధ్య ఎవరికిష్టమొచ్చిన స్టార్ ట్యాగ్ వాళ్ల పేరు ముందు యాడ్ చేసుకోవడం అలవాటయిపోయింది అంటూ సోషల్ మీడియాలో కౌంటర్స్ వేస్తున్నారు నెటిజన్లు.
View this post on Instagram