Bigg Boss Kajal : కాజల్ పై సీరియస్ అయిన బిగ్‌బాస్‌ నిర్వాహకులు

బిగ్ బాస్ తో చేసుకున్న ఒప్పందం ప్రకారం ఎపిసోడ్ టెలికాస్ట్ అయ్యేవరకు, ఆ తర్వాత బిగ్ బాస్ బజ్ అనే ప్రోగ్రాం ఇంటర్వ్యూ అయ్యేవరకు కంటెస్టెంట్స్ బయట కనపడకూడదు. అయితే కాజల్......

Bigg Boss Kajal : కాజల్ పై సీరియస్ అయిన బిగ్‌బాస్‌ నిర్వాహకులు

Kajal

Updated On : December 13, 2021 / 7:49 AM IST

Bigg Boss Kajal :  నిన్నటి వీకెండ్ ఎపిసోడ్ తో బిగ్ బాస్ నుంచి కాజల్ ఎలిమినేట్ అయిపొయింది. దీంతో ఇంకా 5 గురు కంటెస్టెంట్స్ మాత్రమే ఈ చివరి వారం గేమ్ ఆడతారు. అయితే కాజల్ చేసిన ఓ పనికి బిగ్ బాస్ నిర్వాహకులు సీరియస్ అవుతున్నారు. సాధారణంగా బిగ్ బాస్ స్క్రిప్టెడ్ షో అని అందరికి తెలిసిందే. మనకి వచ్చే ఎపిసోడ్ ఒక రోజు లేదా రెండు రోజుల ముందే షూట్ చేస్తారు. ఎవరైనా కంటెస్టెంట్ ఎలిమినేట్ అయితే ఆ ఎపిసోడ్ సండే రోజు టెలికాస్ట్ అవుతుంది. కానీ షూటింగ్ అయిపోతుంది కాబట్టి ఆ వ్యక్తి ఒకటి లేదా రెండు రోజుల ముందే బయటకి వస్తారు.

Project K : చేయి చేయి కలిపిన ప్రభాస్ – దీపికా పదుకొణె

బిగ్ బాస్ తో చేసుకున్న ఒప్పందం ప్రకారం ఎపిసోడ్ టెలికాస్ట్ అయ్యేవరకు, ఆ తర్వాత బిగ్ బాస్ బజ్ అనే ప్రోగ్రాం ఇంటర్వ్యూ అయ్యేవరకు కంటెస్టెంట్స్ బయట కనపడకూడదు. అయితే కాజల్ ఈ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. నిన్న 14వ వారం హౌస్ నుంచి ఆర్జే కాజల్ బయటకు వచ్చేసింది. నిన్న నైట్ ఈ ఎపిసోడ్ టెలికాస్ట్ అయింది. ఎవరు ఎలిమినేట్ అవుతున్నారు అనేది సోషల్ మీడియాలో లీక్ వచ్చినా సంబంధం లేదు కానీ తమకు తాముగా బయటికి వచ్చి ఎలిమినేట్ అయిన విషయం చెప్పకూడదు అనేది బిగ్ బాస్ నిభందనలు. అయితే కాజల్ మాత్రం ఈ నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించి కాస్త తొందర పడింది. ఎలిమినేషన్ తర్వాత ఎపిసోడ్ టెలికాస్ట్ అవ్వకముందే ఓ యూట్యూబ్ ఛానల్ లైవ్ లో కనపడింది. అంతే కాక ప్రేక్షకులు అడిగే ప్రశ్నలకు సమాధానాలు కూడా చెప్పింది. దాంతో అధికారికంగానే ఈ వారం కాజల్ బయటకు వస్తుంది అని అందరికీ ముందుగానే తెలిసిపోయింది.

Pawan Kalyan : పంతానికి పోతే నా సినిమాలను ఉచితంగా ఆడిస్తా : పవన్ కళ్యాణ్\

కాజల్ ఇలా చేయడంతో బిగ్ బాస్ నిబంధనలు ఉల్లంఘించినందుకు ఆ షో నిర్వాహకులతో పాటు ఛానల్ నిర్వాహకులు కూడా సీరియస్ అయినట్లు తెలుస్తుంది. అధికారికంగా ఇంకా ఎపిసోడ్ ప్రసారం అవ్వకుండానే కాజల్ ఇలా బయటకి రావడంతో చర్చాంశనీయం అవుతుంది. మరి దీనిపై కాజల్ ఎలాంటి క్లారిటీ ఇస్తుందో చూడాలి. నిర్వాహకులు కాజల్ పై ఎలాంటి చర్యలు తీసుకుంటారో మరి?