కొత్త దర్శకులకు హెల్ప్ చేస్తున్న సీనియర్లు..

లాక్‌డౌన్ లాస్ట్‌స్టేజ్‌కి వచ్చినా పెద్ద సినిమాలేవీ ఇప్పటి వరకూ సెట్స్ మీదకెళ్లలేదు. అందుకే ఇదే మంచి టైమ్ అనుకుని.. చిన్న సినిమాల హవా మొదలైపోయింది. మొన్నీ మధ్య వరకూ కథల మీద కసరత్తులు చేసిన పెద్ద డైరెక్టర్లు.. ఇప్పుడు తమ కథలను యంగ్ డైరెక్టర్లకు, చిన్న డైరెక్టర్లకు అప్పు ఇస్తున్నారు.
పెద్ద డైరెక్టర్ల సినిమాలేవీ ఇప్పుడు సెట్స్ మీదకెళ్లే పరిస్థితి కనిపించడం లేదు. అందుకే చిన్న సినిమాలు స్పీడందుకున్నాయి. ఈ లాక్‌డౌన్ పీరియడ్‌లో ఖాళీగా ఉండి కథలు రాసుకున్న పెద్ద డైరెక్టర్లు.. యంగ్ డైరెక్టర్లకు కథలు అరువుగా ఇస్తున్నారు. రీసెంట్‌గా సంపత్ నంది, మోహన్ భరద్వాజ్ డైరెక్ట్ చేస్తున్న ‘బ్లాక్ రోజ్’ అనే సినిమాకు కథ, స్క్రీన్‌ప్లే అందిస్తున్నారు. మిస్ ఇండియా ఊర్వశీ రౌతేల హీరోయిన్‌గా నటిస్తోంది. సంపత్ నంది ప్రస్తుతం గోపీచంద్, తమన్నాలతో ‘సీటీమార్’ అనే సినిమా చేస్తున్నాడు.
క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కూడా సుకుమార్ రైటింగ్స్ బ్యానర్‌లో చిన్న సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. వైష్ణవ్ తేజ్ హీరోగా బుచ్చిబాబు డైరెక్షన్లో వస్తున్న ‘ఉప్పెన’ సినిమాకు కథాసహకారం అందించారు సుకుమార్. అంతేకాకుండా ‘కుమారి 21 ఎఫ్’ సినిమా డైరెక్టర్ ప్రతాప్ దర్శకత్వంలో నిఖిల్ హీరోగా నటిస్తున్న ‘18 పేజెస్’ సినిమాకు కూడా సుకుమార్ కథ అందిస్తున్నారు. ఇప్పుడు సాయిధరమ్ తేజ్ హీరోగా యంగ్ డైరెక్టర్ కార్తీక్ దండు దర్శకత్వంలో తెరకెక్కబోతున్న థ్రిల్లర్ సినిమాకు సుకుమార్ స్క్రీన్‌ప్లే సమకూరుస్తున్నారు. అల్లు అర్జున్‌తో చేస్తున్న ‘పుష్ప’ షూటింగ్ వాయిదా పడడంతో సుకుమార్ ఇలా బిజీ అయిపోయారు.
మరో టాప్ డైరెక్టర్ కొరటాల శివ కూడా తన సినిమాలతో పాటు యంగ్ అప్‌కమింగ్ డైరెక్టర్ అయిన మరో డైరెక్టర్‌కి కథా సహకారం అందిస్తున్నారు. అదికూడా ప్రజెంట్ ట్రెండింగ్‌లో ఉన్న వెబ్ సిరీస్‌కి కావడం విశేషం. కొరటాల ప్రస్తుతం ఓ వెబ్ సిరీస్‌కి స్టోరీ ఇస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవితో చెయ్యాల్సిన ‘ఆచార్య’ సినిమా షూటింగ్ ఇంకా స్టార్ట్ కాకపోవడంతో ఈ గ్యాప్‌లో శివ వెబ్ సిరీస్‌కి కథ ఇస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో తమ సినిమాల షూటింగులకు బ్రేక్ రావడంతో కొత్త కథల్ని యంగ్ డైరెక్టర్లకిచ్చి ఇలా హెల్ప్ చేస్తున్నారు పెద్ద డైరెక్టర్లు .