Bigg Boss 6 Gives Surprise To Revanth
Bigg Boss 6: బుల్లితెర రియాలిటీ షో బిగ్‌బాస్ సీజన్ 6 అప్పుడే 26 రోజులకు చేరుకుంది. ఈ రియాలిటీ షోకు సంబంధించిన 25వ రోజు చాలా ఎమోషనల్‌గా సాగింది. ముఖ్యంగా కంటెస్టెంట్స్ ఒకరి గురించి ఒకరు, ఇతర కంటెస్టెంట్స్‌తో తమ ఫీలింగ్స్ షేర్ చేసుకుంటూ కనిపించారు. అయితే సింగర్ రేవంత్‌కు ఈ ఎపిసోడ్‌లో బిగ్‌బాస్ ఓ అదిరిపోయే సర్‌ప్రైజ్‌ను ఇచ్చి కంటెస్టెంట్స్ అందరినీ ఎమోషనల్ చేశాడు.
BiggBoss 6 Day 20 : “నీ ఆట తీరు చూసి మేము కూడా షాక్‌లో ఉన్నాం”.. నాగార్జున
రేవంత్ ఈ బిగ్‌బాస్ హౌజ్‌లో ఎంట్రీ ఇచ్చే సమయంలో అతడి భార్య గర్భవతిగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఆమె శ్రీమంతం వేడుకకు సంబంధించి బిగ్‌బాస్ ఓ వీడియో ప్లే చేశాడు. ఇది చూస్తున్నంతసేపు రేవంత్ కన్నీళ్లు పెడుతూనే ఉన్నాడు. ఇంటిలోపల ఉన్న ఇతర హౌజ్ మేట్స్‌ను పిలిచి వారిని గట్టిగా హగ్ చేసుకున్నాడు. ఇక తన భార్య శ్రీమంతం ఫోటోపై అక్షింతలు చల్లి మరోసారి ఎమోషనల్ అయ్యాడు రేవంత్.
ఇలా ఇంటి సభ్యుడైన రేవంత్‌కు బిగ్‌బాస్ ఇచ్చిన ఈ సర్‌ప్రైజ్ తాను ఎప్పటికీ గుర్తుకుపెట్టుకుంటానని రేవంత్ ఈ సందర్భంగా తెలిపాడు. ఇక రేవంత్ ఎమోషనల్ అవుతున్నంతసేపు ఇతర ఇంటి సభ్యులు కూడా ఎమోషనల్ అవడం మనకు కనిపించింది. మొత్తానికి 25వ రోజు రేవంత్‌కు బిగ్‌బాస్ ఇచ్చిన సర్‌ప్రైజ్‌తో ఎమోషనల్‌గా సాగింది.