Bigg Boss 7 Day 100 Highlights Bigg Boss Shows Sivaji and Priyanka Emotional Journey
Bigg Boss 7 Day 100 : బిగ్‌బాస్ 14 వారాలు పూర్తయి ప్రస్తుతం చివరివారం నడుస్తుంది. ఫైనల్ లోకి అమర్ దీప్, అర్జున్, ప్రియాంక, శివాజీ, ప్రశాంత్, యావర్ లు వచ్చారు. వీరిలో ఎవరు కప్పు కొడతారో అని అందరూ ఎదురు చూస్తున్నారు. ఇక చివరి వారం నామినేషన్స్, ఫైట్స్, గేమ్స్, టాస్కులు లేకుండా ఎమోషనల్ గా సాగుతుంది. సోమవారం ఎపిసోడ్ లో అమర్ దీప్, అర్జున్ లకు సంబంధించిన ఎమోషనల్ జర్నీని చూపించాడు బిగ్‌బాస్. ఇక నిన్న మంగళవారం ఎపిసోడ్ లో శివాజీ, ప్రియాంకల బిగ్ బాస్ జర్నీని చూపించారు.
మొదట శివాజీని లాన్ లోకి పిలిచాడు బిగ్‌బాస్. శివాజీ బిగ్‌బాస్ జర్నీ ఫొటోలతో అందంగా డెకరేట్ చేశారు. అదంతా చూసి శివాజీ సంతోషపడ్డాడు. ఆ తర్వాత శివాజీకి సంబంధించిన బిగ్‌బాస్ జర్నీని దాదాపు 17 నిమిషాల వీడియోలో చూపించారు. ఇది చూసిన శివాజీ నవ్వుతూ ఆనందం వ్యక్తపరిచారు. ఈ వీడియో తర్వాత శివాజీ మాట్లాడుతూ.. 25 ఏళ్ళ సినిమా జర్నీ ఒక ఎత్తు, ఈ బిగ్‌బాస్ జర్నీ ఒక ఎత్తు. కప్పు కొడతామా లేదా తెలీదు కానీ ప్రేక్షకుల మనసులని మాత్రం గెలుస్తాను అని ఎప్పుడూ పాడే పాటే పాడాడు.
Also Read : Bigg Boss 7 Day 99 : చివరి వారం.. ఎమోషనల్ జర్నీలే.. అమర్, అర్జున్ బిగ్‌బాస్ జర్నీ..
ఇక శివాజీ తర్వాత ప్రియాంకని పిలిచాడు బిగ్‌బాస్. ఈమెకి సంబంధించిన ఫొటోలతో లాన్ లో అందంగా డెకరేట్ చేశారు. వాటిల్లో తన బాయ్ ఫ్రెండ్ తో ఉన్న ఫోటో చూసి ఎమోషనల్ అయింది ప్రియాంక. ఇక ప్రియాంకకు ఎలివేషన్స్ ఇస్తూ ఓ 15 నిమిషాల వీడియోని ప్లే చేశారు. ఈ వీడియో చూసిన అనంతరం ప్రియాంక ఆనంద భాష్పాలతో ఏడ్చేసింది. ఇలా రోజుకు ఇద్దరు చొప్పున ఎమోషనల్ జర్నీలు చూపిస్తూ చివరివారం సాగదీస్తున్నాడు బిగ్‌బాస్. సోమవారం నాడు అమర్, అర్జున్ ల వీడియోలు చూపించగా మంగళవారం నాడు శివాజీ, ప్రియాంకల వీడియోలు చూపించారు. ఇక నేడు బుధవారం నాడు యావర్, ప్రశాంత్ ల వీడియోలు చూపించబోతున్నట్టు తెలుస్తుంది.