Bigg Boss Telugu 7
Bigg Boss 7 Day 2 : నాగార్జున(Nagarjuna) హోస్ట్ గా బిగ్‌బాస్(Bigg Boss) సీజన్ 7 రెండు రోజులు పూర్తయింది. 14 మంది కంటెస్టెంట్స్ షోలోకి రాగా మొదటి రోజు సరదాగా సాగిన షో ఇక రెండో రోజు నుంచి అసలు యాక్టివిటీలను బయటకు తీస్తుంది. మొదటి రోజు లాస్ట్ లో నామినేషన్స్(Nominations) ప్రక్రియ మొదలు పెట్టగా ఫస్ట్ డే ఎపిసోడ్ లో ఇద్దరే నామినేషన్స్ వేశారు. ఇక రెండో రోజు అంతా నామినేషన్స్, ఆ నామినేషన్స్ తో వచ్చే గొడవలతోనే సాగింది.
మొదటి వారం నామినేషన్స్ కి కంటెస్టెంట్స్ ని ఒక రూమ్ లోకి పిలిచి ఎవరినైతే నామినేట్ చేయాలనుకుంటున్నారో చెప్పి అక్కడ ఉన్న ఆ కంటెస్టెంట్స్ ఫోటోలను చింపి మంటలో వేయాలి అని చెప్పారు.
మొదటి ఎపిసోడ్ లోనే..
మొదట శివాజీ వచ్చి దామిని, గౌతమ్ కృష్ణ ఫోటోలు చింపి వారిని నామినేట్ చేశాడు.
అనంతరం ప్రియాంక జైన్ వచ్చి పల్లవి ప్రశాంత్, రతికని నామినేట్ చేసింది.
ఇక రెండో ఎపిసోడ్ లో..
మొదట శోభా శెట్టి వచ్చి గౌతమ్ కృష్ణ, కిరణ్ రాథోడ్ ని నామినేట్ చేసింది. నామినేషన్ అయ్యాక బయటకు వచ్చి గౌతమ్ తో గొడవ పడింది.
సింగర్ దామిని.. రతికని, శోభా శెట్టిని నామినేట్ చేసింది.
మోడల్ ప్రిన్స్.. షకీలా, గౌతమ్ కృష్ణని నామినేట్ చేసాడు.
ఆటా సందీప్.. రతిక, ప్రిన్స్ లను నామినేట్ చేసాడు.
షకీలా – ప్రిన్స్, పల్లవి ప్రశాంత్ లను నామినేట్ చేసింది.
గౌతమ్ కృష్ణ.. శోభా శెట్టి, ప్రిన్స్ లను నామినేట్ చేశాడు. దీంతో మరోసారి గౌతమ్, శోభా శెట్టిల మధ్య గొడవ అయింది.
శుభశ్రీ.. రతిక, శోభా శెట్టిలను నామినేట్ చేసింది.
పల్లవి ప్రశాంత్.. షకీలా, కిరణ్ రాథోడ్ లను నామినేట్ చేశాడు.
అమర్ దీప్.. ప్రిన్స్, తేజని నామినేట్ చేశాడు.
కిరణ్ రాథోడ్.. ప్రశాంత్, శోభా శెట్టిని నామినేట్ చేసింది.
టేస్టీ తేజ.. ప్రశాంత్, కిరణ్ రాథోడ్ ని నామినేట్ చేశారు.
రతిక.. ప్రియాంక జైన్, దామినిలను నామినేట్ చేసింది.
దీంతో ఎక్కువ నామినేషన్స్ వచ్చిన 8 మందిని ఈ వారంలో నామినేషన్స్ లో నిలిపారు. మొత్తంగా ఈ వారంలో శోభా శెట్టి, రతిక, ప్రిన్స్, ప్రశాంత్, కిరణ్ రాథోడ్, గౌతమ్ కృష్ణ, షకీలా, దామిని నామినేషన్స్ లో ఉన్నారు. మరి వీరిలో బాగా ఆడి ఈ వారం ఎలిమినేషన్స్ నుంచి ఎవరు తప్పించుకుంటారో చూడాలి.