Bigg Boss 7 Day 71 : భోలే వెళ్లిపోవడంతో రతికని తన గ్రూప్ లోకి తెచ్చుకోవడానికి ట్రై చేస్తున్న శివాజీ.. నామినేషన్స్ షురూ..

భోలే వెళ్లిపోవడంతో శివాజీ గ్రూప్ లో ఒక మెంబర్ తగ్గారు. దీంతో శివాజీ రతికని తన గ్రూప్ లో తెచ్చుకోవడానికి ప్రయత్నించాడు.

Bigg Boss 7 Day 71 Highlights Sivaji Group Try to Influence Rathika

Bigg Boss 7 Day 71 : ఆదివారం ఎపిసోడ్ లో బిగ్‌బాస్ నుంచి భోలే శవాలీ ఎలిమినేట్ అయి వెళ్ళిపోయాడు. ఇక సోమవారం ఎపిసోడ్ భోలే వెళ్లిపోయాడని అశ్విని బాధపడుతుండటంతో మొదలైంది. అనంతరం భోలే వెళ్లిపోవడంతో శివాజీ గ్రూప్ లో ఒక మెంబర్ తగ్గారు. దీంతో శివాజీ రతికని తన గ్రూప్ లో తెచ్చుకోవడానికి ప్రయత్నించాడు. ఎప్పుడూ లేనిది రతిక దగ్గరికి వెళ్లి కూర్చొని.. నామినేషన్స్ లో తగ్గకు, అలా చెయ్యి, ఇలా చెయ్యి అంటూ సలహాలు ఇచ్ఛాడు. మొత్తానికి రతికని తన గ్రూప్ లోకి తెచ్చుకోవడానికి బాగానే ప్లాన్ చేసాడు శివాజీ. నామినేషన్స్ ముందు శివాజీ.. రతికని చాలా సేపు ఇన్ఫ్లూయెన్స్ చేసాడు.

దీంతో ఎప్పుడూ సైలెంట్ గా ఉండే రతిక నామినేషన్స్ మొదలవ్వగానే శివాజీ అండతో రెచ్చిపోయింది. నామినేషన్స్ లో మొదట రతిక.. శోభాశెట్టి, ప్రియాంకలని నామినేట్ చేసింది. రతిక చెప్పే కారణాలు సరిగ్గా లేవంటూ ఇద్దరూ లాజిక్స్ మాట్లాడటంతో రతిక దగ్గర సమాధానం లేకుండా పోయింది. ఇక ప్రియాంక అయితే ఇండైరెక్ట్ గా శివాజీకి కూడా కౌంటర్లు ఇచ్చింది.

Also Read : Anchor Suma : యాంకర్ సుమ ఫ్యామిలీ ఫోటోలు చూశారా..

ఆ తర్వాత అర్జున్.. ప్రశాంత్, శోభాశెట్టిలను నామినేట్ చేసాడు. ప్రశాంత్, శివాజీలని కలిపి ఫైర్ అయ్యాడు అర్జున్. అర్జున్ కూడా శివాజీ గ్రూప్ అంటూ అడిగిన వాటికి ప్రశాంత్ దగ్గర సమాధానం లేక సైలెంట్ గా ఉండిపోయాడు. శివాజీ కూడా అర్జున్ మాట్లాడిన లాజిక్స్ కి కనీసం స్పందించాను కూడా లేదు. ఆ తర్వాత ప్రియాంక.. రతిక, అశ్వినిలని నామినేట్ చేసింది. గౌతమ్.. అర్జున్, అమర్ దీప్ లను నామినేట్ చేశాడు. సోమవారం ఎపిసోడ్ లో కేవలం నాలుగు నామినేషన్స్ తోనే ముగించేశారు. మిగతా నామినేషన్స్ నేటి ఎపిసోడ్ లో జరగనున్నాయి. మొత్తానికి హౌస్ లో శివాజీ గ్రూప్ తమకు వ్యతిరేకంగా ఉన్నవారిని టార్గెట్ చేసి గేమ్ ఆడుతున్నట్టు క్లియర్ గా తెలుస్తుంది.