Bigg Boss 7 : ఈ సారి నామినేష‌న్ ప్ర‌క్రియ కాస్త కొత్త‌గా.. మంట త‌గ్గ‌లే..!

బిగ్‌బాస్ తెలుగు సీజ‌న్ 7లో మూడు వారాలు పూర్తి అయ్యాయి. ముగ్గురు కంటెస్టెంట్లు కిర‌ణ్ రాథోడ్, ష‌కీలా, దామిని లు ఎలిమినేట్ అయ్యారు. నాలుగో వారంలోకి అడుగుపెట్టింది.

Bigg Boss 7 Telugu : బిగ్‌బాస్ (Bigg Boss) తెలుగు సీజ‌న్ 7లో మూడు వారాలు పూర్తి అయ్యాయి. ముగ్గురు కంటెస్టెంట్లు కిర‌ణ్ రాథోడ్ (Kiran Rathod), ష‌కీలా (Shakeela), దామిని (Damini)లు ఎలిమినేట్ అయ్యారు. ఇక షో నాలుగో వారంలోకి అడుగుపెట్టింది. సోమ‌వారం వ‌చ్చిదంటే చాలు హౌస్‌లో నామినేష‌న్ ర‌చ్చ ఉంటుంది అన్న సంగ‌తి తెలిసిందే. ఈ సారి ఎవ‌రు నామినేష‌న్‌లో ఉంటారో తెలుసుకోవాల‌ని చూస్తుండ‌గా తాజాగా ఇందుకు సంబంధించి ప్రొమో వ‌చ్చేసింది.

రెండు చేతులు క‌లిస్తేనే చ‌ప్ప‌ట్లు వ‌స్తాయ‌ని అన్నావంటూ శివాజీతో ర‌తిక అంది. తాను లేక‌పోతే నాగార్జున వీడియోలు వేసి చూపిస్తే నీ ప‌రిస్థితి ఏంటీ..? అని శివాజీ ప్ర‌శ్నించ‌గా.. వీడియోలు ఉంటే చూపియ‌వు ఇంకా హ్యాపీ అని ర‌తిక అంది. వీరిద్ద‌రి మ‌ధ్య ఈ విష‌యమై పెద్ద డిస్క‌ష‌న్ జ‌రిగిన‌ట్లుగా క‌నిపిస్తోంది. ఇప్పుడు నీ కాళ్లు ప‌ట్టుకోవాలా, ఎందుకు ఇంకా సాగ‌దీస్తున్నావంటూ శివాజీ అస‌హ‌నం వ్య‌క్తం చేశాడు.

కొంచెం కొత్త‌గా..

ఎప్ప‌టిలా కాకుండా ఈ సారి బిగ్‌బాస్ కొత్త త‌ర‌హా నామినేష‌న్ ప్ర‌వేశ‌పెట్టాడు. ప‌వ‌రాస్త్ర గెలుచుకున్న సందీప్‌, శివాజీ, శోభాల‌ను జ్యూరీ స‌భ్యులుగా నియ‌మించాడు. ఇత‌ర కంటెస్టెంట్లు తాము నామినేట్ చేయాల‌నుకున్న వాళ్ల‌ను బోనులో నిల‌బెట్టి అందుకు త‌గిన కార‌ణాలు చెప్పాలి. వాళ్లు చెప్పిన కార‌ణాలు క‌రెక్టు అని జ్యూరీ స‌భ్యులు బావిస్తే బోనులో ఉన్న వ్య‌క్తులు నామినేట్ అవుతారు.

Kannappa : హీరోయిన్ లేకుండా ‘కన్నప్ప’ షూటింగ్ స్టార్ట్.. మూవీలో మరో సూపర్ స్టార్..!

ప్రియాంక‌ను ప్రిన్స్ యావ‌ర్ నామినేట్ చేశాడు. ఫెమినిజాన్ని అడ్డుపెట్టుకుని ఇద్ద‌రు అమ్మాయిలు న‌న్ను ఆట‌లోంచి త‌ప్పించార‌ని ప్రియాంక‌ను ఉద్దేశిస్తూ చెప్పాడు. అయితే.. ఇందుకు జ‌డ్జిగా ఉన్న శోభా అభ్యంత‌రం తెలిపింది. ఇద్ద‌రు అమ్మాయిలు ఉండ‌డంతో నువ్వు త్యాగం చేస్తాన‌ని తేజ‌తో అన్నావా లేదా అని ప్ర‌శ్నించింది. అది వేరే విష‌యం అని, అంద‌రి ముందు చెప్పిన దాని గురించి తాను మాట్లాడుతున్నాన‌ని ప్రిన్స్ అన్నాడు. అనంత‌రం అత‌డు తేజ‌ను కూడా నామినేట్ చేశాడు.

రతికను శుభశ్రీ నామినేట్ చేసింది. ఇక్క‌డ లేని ఓ వ్య‌క్తి గురించి మాట్లాడుతూ ర‌తిక రూల్ అతిక్ర‌మించింది అంటూ శుభ‌శ్రీ చెప్పింది. ఈ వారం ర‌తిక‌, శుభ‌శ్రీ, తేజ‌, గౌత‌మ్‌, ప్రిన్స్ యావ‌ర్‌, ప్రియాంక నామినేష‌న్‌లో ఉన్న‌ట్లు గా తెలుస్తోంది. వీరంతా నామినేష‌న్‌లో ఉన్నారా..? ఇంకా ఎవ‌రెవ‌రు ఉన్నారు..? తెలియాలంటే పూర్తి ఎపిసోడ్ వ‌ర‌కు వెయిట్ చేయాల్సిందే.

Prabhas : మరో ప్రభాస్ మైనపు బొమ్మ.. ట్రోల్ చేస్తున్న నెటిజెన్స్..

ట్రెండింగ్ వార్తలు